ఒకదాని తర్వాత ఒకటి.. రప్పా.. రప్పా.. కేసులు వెంటాడుతూనే ఉన్నాయ్..! చూస్తుంటే త్వరలోనే పోసాని కృష్ణమురళికి కంప్లీట్ ఏపీ యాత్ర తప్పేలా లేదు..! ఎక్కడికక్కడ కేసులు ఉండడంతో.. PT వారెంట్‌లపై ఆయన్ను ఆయా PSలకు తీసుకెళ్లబోతున్నారు. ఇప్పుడు రాజంపేట జైలు నుంచి ఆయన్ను నరసరావుపేట తరలిస్తున్నారు. ఇంకా చాలా చోట్ల వారెంట్లు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది..! రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై వివిధ స్టేషన్లలో 30 పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిల్లో 17 కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్‌గా మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలుకి వెళ్లారు. గుంటూరుజిల్లా నరసరావుపేట టూ టౌన్ పోలీసులు, అనంతపురం రూరల్, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు.. పోసానిని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. ,

పోలీసులు ఉన్నతాధికారులతో చర్చలు
మూడు జిల్లాల పోలీసులు ఒకేసారి రావడంతో.. ముందుగా పోసానిని ఎవరికి అప్పగించాలనే దానిపై రాజంపేట పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడుజిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని నరసరావుపేటకు తరలించారు. వరుసగా కేసులు.. పీటీ వారెంట్లు పోసానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పోసానితో పాటు వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోసాని ఒక మూర్ఖుడు. పోసాని లాంటి వాళ్లతో అప్పుడు తిట్టించి ఇప్పుడు గగ్గోలు పెడతారా? అని నిలదీశారు.