పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

ఒకదాని తర్వాత ఒకటి.. రప్పా.. రప్పా.. కేసులు వెంటాడుతూనే ఉన్నాయ్‌..! చూస్తుంటే త్వరలోనే పోసాని కృష్ణమురళికి కంప్లీట్‌ ఏపీ యాత్ర తప్పేలా లేదు..! ఎక్కడికక్కడ కేసులు ఉండడంతో.. PT వారెంట్‌లపై ఆయన్ను ఆయా PSలకు తీసుకెళ్లబోతున్నారు. ఇప్పుడు రాజంపేట జైలు నుంచి ఆయన్ను నరసరావుపేట తరలిస్తున్నారు. ఇంకా చాలా చోట్ల వారెంట్లు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది..! రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై వివిధ స్టేషన్లలో 30 పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిల్లో 17 కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్‌గా మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలుకి వెళ్లారు. గుంటూరుజిల్లా నరసరావుపేట టూ టౌన్ పోలీసులు, అనంతపురం రూరల్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు.. పోసానిని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. ,

Advertisements
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

పోలీసులు ఉన్నతాధికారులతో చర్చలు

మూడు జిల్లాల పోలీసులు ఒకేసారి రావడంతో.. ముందుగా పోసానిని ఎవరికి అప్పగించాలనే దానిపై రాజంపేట పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడుజిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని నరసరావుపేటకు తరలించారు. వరుసగా కేసులు.. పీటీ వారెంట్లు పోసానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పోసానితో పాటు వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోసాని ఒక మూర్ఖుడు. పోసాని లాంటి వాళ్లతో అప్పుడు తిట్టించి ఇప్పుడు గగ్గోలు పెడతారా? అని నిలదీశారు.

Related Posts
టెస్లా ప్రతినిధులతో నారా లోకేష్‌ సమావేశం
టెస్లా ప్రతినిధులతో నారా లోకేష్‌ సమావేశం

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో Read more

తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠా ఆ వ్యక్తులు – పట్టాభి
pattabhi jagan

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జగన్-షర్మిల ఆస్తుల పంపకం వివాదంపై స్పందించారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తుందని, తాడేపల్లి ఇంటికి విధేయంగా పనిచేస్తున్న Read more

Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి: కొండా సురేఖ
Board of Trustees of Yadagirigutta Temple.. Konda Surekha

Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. 18 మంది Read more

ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు
ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు

నందమూరి తారకరామారావు (ఎన్.టి.ఆర్) మనవడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్ ఘాట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్ యొక్క 29వ వర్ధంతి Read more

×