హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ మాన్‌సూన్ రెగెట్టా (Monsoon Regatta) చాంపియన్‌షిప్ 2025లో పలు అంచనాల మధ్య షెడ్యూల్ అయిన ఐదో రోజు పోటీలు అనూహ్యంగా రద్దయ్యాయి.శుక్రవారం పోటీలు రద్దయ్యాయి.తీవ్రమైన వాతావరణ ప్రతికూలతలు, బలమైన గాలులు, వర్షపాతం కారణంగా నిర్వాహకులు అన్ని గటజాల (సెయిలింగ్) పోటీలను రద్దు చేయాల్సి వచ్చింది.దీంతో ఇప్పటివరకు అగ్రస్థానాల్లో ఉన్నవారికి పతకాలు ఖరారు కాగా, మిగతావారు నిరాశ చెందారు.12 రేసుల సిరీస్‌లో ఇంకా నాలుగు రేసులు మిగిలి ఉన్నాయని చాంపియన్‌షిప్ నిర్వాహకులు పేర్కొన్నారు.

మెరుగైన ప్రదర్శన
ఈ పోటీ రద్దుతో ఇప్పటికే పాయింట్ల పట్టికలో ముందున్నవారికి గట్టి లాభం చేకూరింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు రోజుల రేసుల్లో మెరుగైన ప్రదర్శన చేసిన గటర్లు వారి స్థాయిని నిలబెట్టుకున్నారు. ఫలితంగా వారికి పతకాలు ఖరారయ్యాయి.శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే టాప్‌లో ఉన్న వారికి ట్రోఫీలు అందచేస్తామని వారు తెలిపారు. ఇదిలా ఉంటే ఆసియా క్రీడల ప్రతిభాన్వేషణలో భాగంగా గత రెండు నెలలుగా యాచ్‌క్లబ్ (Yacht Club) లో శిక్షణ పొందుతున్న తెలంగాణలోని వివిధ గ్రామాలకు చెందిన యువ సెయిలర్లకు సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి సైదులు, ప్రధాన కార్యదర్శి తిరుపతి బహుమతులు అందజేశారు.
Read Also: Mitchell Starc: WTC ఫైనల్ లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్