మలయాళంలో సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం తుడారుమ్. మోహన్ లాల్, ప్రతిభావంతులైన దర్శకుడు తరుణ్ మూర్తితో కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన దాని ఆశాజనకమైన ప్రమోషనల్ వీడియోలు, పోస్టర్లు మరియు లొకేషన్ స్టిల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆపరేషన్ జీవా
మలయాళ సినిమా రంగంలో లెజెండరీ కాంబినేషన్‌గా పేరొందిన మోహన్‌లాల్ – శోభన జంట మళ్లీ తెరపైకి రానుంది. వారిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా మలయాళ చిత్రం “తుడరుమ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ‘ఆపరేషన్ జీవా’ ఫేం దర్శకుడు తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తుండగా, ఎం. రెంజిత్ ‘రెజపుత్ర విజువల్ మీడియా’ పతాకంపై నిర్మిస్తున్నారు.ఒకవైపు ఎల్2 ఎంపురాన్ సినిమాతో విజయం అందుకున్నాడు మోహన్ లాల్. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ సినిమాకి ఈ చిత్రం పార్ట్ 2గా వచ్చింది. మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టింది.
56వ చిత్రం
ఈ సినిమా తర్వాత మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు లాల్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘తుడరుమ్’ ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి శోభన కథానాయికగా నటిస్తుంది. ఇప్పటివరకు మోహన్ లాల్, శోభన కాంబోలో 55 సినిమాలు రాగా ఇది 56వ చిత్రంగా రాబోతుంది. మోహన్‌లాల్‌తో చివరిగా 1987లో నటించిన శోభన దాదాపు 38 ఏండ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల టీజర్‌ను విడుదల చేశారు.ఈ సినిమా కథ విషయానికి వస్తే మోహన్ లాల్ ఇందులో టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండగా అతడి కారు అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. అయితే ఆ సమస్య ఏంటి ఆ కారుని వదిలిపెట్టి మోహన్‌లాల్ ఒక్కక్షణం ఎందుకు ఉండలేడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. క్రైమ్ కామెడీగా ఈ చిత్రం రాబోతుంది.ఈ సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే వంటి ప్రతి విభాగంలోనూ నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చారని యూనిట్ చెబుతోంది. క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను ఒకే సమానంగా ఆకట్టుకునేలా “తుడరుమ్” రూపొందినట్టు తెలుస్తోంది.
మోహన్‌లాల్, శోభనాలతో పాటు, తుదరమ్‌లో ఫర్హాన్ ఫాసిల్, మణియన్‌పిల్ల రాజు, బిను పప్పు, నందు, ఇర్షాద్ అలీ, ఆర్ష చాందిని బైజు, థామస్ మాథ్యూ, కృష్ణ ప్రభాస్, ప్రకాష్ వర్మ ఇతరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ పాటలు ఒరిజినల్ స్కోర్‌ను కంపోజ్ చేశారు. షాజీ కుమార్ ఫోటోగ్రఫీ దర్శకుడు. నిషాద్ యూసుఫ్, షఫీక్ విబి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. రేజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై రెజపుత్ర రెంజిత్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంటోని పెరుంబవూరు యొక్క ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు.
Read Also: Janhvi Kapoor:జాన్వీ కపూర్‌కు రూ.5 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన అనన్య బిర్లా