ఇంగ్లాండ్ గడ్డపై భారత్ పర్యటనలో రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ అసాధారణమైన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో సిరాజ్ (Mohammed Siraj) తన ఖచ్చితమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టును 407 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం దక్కింది.సిరాజ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఒకొక్కరుగా పెవిలియన్ చేరారు. జాక్ క్రాలీ (19), బెన్ స్టోక్స్ (0), జో రూట్ (22) వంటి కీలక ఆటగాళ్లను వరుసగా ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ కంట్రోల్‌లోకి తీసుకొచ్చాడు.
సిరాజ్ ప్రదర్శనను కొనియాడటం లేదని
6 వికెట్లు తీసినా మహమ్మద్ సిరాజ్‌కు రావాల్సిన గుర్తింపు రావడం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ 6 వికెట్లే బుమ్రా తీసి ఉంటే మాజీ క్రికెటర్లు, బ్రాడ్‌కాస్టర్స్, మీడియా అహో ఓహో అంటూ ఆకాశానికెత్తేదని అభిప్రాయపడుతున్నారు. సౌత్ ఇండియా ప్లేయర్ కావడంతోనే సిరాజ్‌పై వివక్ష చూపిస్తున్నారని,పెద్దగా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు ఒక్కరు కూడా సిరాజ్ ప్రదర్శనను కొనియాడటం లేదని మండిపడుతున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గైర్హాజరీలో సిరాజ్ సగటు బాగుందని, రికార్డ్స్ కూడా బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు. సిరాజ్ తన అద్భుత ప్రదర్శనతో బుమ్రా లేని లోటును తీర్చాడని, అతనికి సరైన గుర్తింపు ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు.

ఓవర్‌నైట్ స్కోర్‌తో
180 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), (22 బంతుల్లో 6 ఫోర్లతో 28) నిరాశపర్చగా కరుణ్ నాయర్(7 బ్యాటింగ్)తో కలిసి కేఎల్ రాహుల్(28 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించాడు. జోష్ టంగ్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 244 పరుగులకు చేరింది.అంతకుముందు 77/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) భారీ సెంచరీలతో రాణించగా, మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరే 6వ వికెట్‌కు 303 పరుగులు జోడించారు. ఈ జోడీని ఆకాశ్ దీప్ (Akash Deep) విడదీసాడు. హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు.
Read hindi news: Suresh Raina: వెండితెరకు పరిచయం కానున్న మాజీ క్రికెటర్ సురేష్ రైనా