సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

నేడు ట్రంప్‌తో మోదీ సమావేశం

ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం పారిస్ నుండి అమెరికా చేరుకున్నారు. గురువారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) Xలో ప్రధాని మోదీ స్వయంగా వాషింగ్టన్ డీసీకి చేరుకున్నట్లు తెలియజేస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య నేడు ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ హౌస్ కు అతిథిగా వచ్చిన మూడవ విదేశీ నాయకుడు నరేంద్ర మోడీ. భారతదేశం – అమెరికా మధ్య సంబంధాలకు నరేంద్ర మోడీ ఈ పర్యటన ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది.

 నేడు ట్రంప్‌తో మోదీ సమావేశం

తులసి గబ్బర్డ్‌తో ప్రత్యేక సమావేశం

అమెరికా చేరుకున్న తర్వాత, ప్రధాని మోదీ అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీలో తులసి గబ్బర్డ్ తో జరిగిన సమావేశంలో ఆమెను అభినందింస్తూ భారతదేశం-అమెరికా స్నేహానికి సంబంధించిన వివిధ అంశాలను ఆమెతో చర్చించానని ప్రధాని మోదీ అన్నారు. అయితే ఈ రెండు దేశాల
భారతీయులు ఘనంగా స్వాగతం

ప్రధాని మోదీ అమెరికాకు చేరుకున్న నరేంద్ర మోడీకి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. వాషింగ్టన్ డిసిలో భారత ప్రవాసులు నాకు చాలా ప్రత్యేకమైన స్వాగతం పలికారు. మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి, భారతదేశం-అమెరికా ప్రపంచ భాగస్వామ్యాన్నిమరింత ముందుకు తీసుకెళ్లడానికి నేను ఎదురు చూస్తున్నాను. ప్రజలకు మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తాం. ఈ రెండు దేశాల ప్రపంచ భాగస్వామ్యంలో ఇది ఒక కొత్త అధ్యాయం అని ట్వీట్ ద్వారా అన్నారు.

ద్వైపాక్షిక చర్చలు

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అమెరికా క్యాబినెట్ సభ్యులు, పరిశ్రమల ప్రముఖులను కలుస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్రాన్స్ తర్వాత ఇప్పుడు అమెరికా ఫ్రాన్స్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ అమెరికాకు చేరుకున్నారు. ఫ్రాన్స్‌లో మోడీ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి పారిస్ AI యాక్షన్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కృత్రిమ మేధస్సు గురించి కూడా చర్చించారు. ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇది భారతదేశానికి ఒక పెద్ద విజయం. ఫ్రాన్స్ అధ్యక్షుడితో కూడా ఆయన ఎన్నో అంశాలపై చర్చించారు.

భారతదేశం-అమెరికా సంబంధాలపై ముఖ్య ప్రకటనలు

  • భారతదేశం-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చ.
  • వ్యాపారం, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త ఒప్పందాలు.
  • ప్రజలకు మెరుగైన భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పని చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్ష.

ఫ్రాన్స్ పర్యటనలో ముఖ్యాంశాలు

  • ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ.
  • పారిస్ AI యాక్షన్ సమ్మిట్‌లో భాగస్వామ్యం.
  • కృత్రిమ మేధస్సు (AI) పై భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం.

మోదీ పర్యటన ప్రాముఖ్యత

ఈ పర్యటన భారతదేశం-అమెరికా సంబంధాల సుస్థిరతకు, గ్లోబల్ లీడర్‌గా భారతదేశ స్థాయిని పెంచడానికి కీలక మైలురాయి.

Related Posts
పెళ్లి వేడుకలో చిరుత ప్రత్యక్షం- వీడియో వైరల్
పెళ్లి వేడుకలో చిరుత ప్రత్యక్షం- వీడియో వైరల్

అదో పెళ్లి వేడుక.. అతిథులతో వాతావరణం అంతా ఎంతో సందడిగా ఉంది. వధూవరులతో సహా పెళ్లికి వచ్చిన వారంతా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తూ మ్యూజిక్‌ను ఎంజాయ్‌ Read more

అందుబాటులో కన్యాకుమారి గ్లాస్ బ్రిడ్జి
glass bridge

మరికొన్ని గంటల్లో కొత్త ఆశయాలు, కోరికలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొత్త ఏడాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు Read more

IMD హెచ్చరిక: ఈ శీతాకాలంలో మరో తుపాన్ ప్రభావం
cyclone

శీతాకాలం దేశంలో మొదలైంది. అనేక రాష్ట్రాలలో వర్షాలు, మెరుపులు కనిపిస్తుండగా, భారత వాతావరణ శాఖ (IMD) ఈ సీజన్‌లో మరో తుపాను గురించి హెచ్చరిక విడుదల చేసింది. Read more

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనపై : కాంగ్రెస్ విమర్శలు
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనపై : కాంగ్రెస్ విమర్శలు

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడం కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రత్యక్షంగా అంగీకరించడమేనని, అక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ శుక్రవారం Read more