ఈరోజు (ఆగస్టు 10న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నగరంలో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా, బెంగళూరు మెట్రో రైలులోని ఎల్లో లైన్ మరియు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన ప్రారంభిస్తారు. ఈ పర్యటన సుమారు 4 గంటలపాటు కొనసాగనుంది. ఈ ప్రాజెక్టులు బెంగళూరు రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని భావిస్తున్నారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ప్రధాని మోదీ ఉదయం 10:30 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్, రోడ్డు మార్గం ద్వారా కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ఆయన కేఎస్ఆర్ బెంగళూరు – బెలగావి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. ఈ రైలు ప్రారంభంతో కర్ణాటకలోని ముఖ్య నగరాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది.
బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన తర్వాత, ప్రధాని మోదీ ఆర్.వి. రోడ్ మెట్రో స్టేషన్ నుంచి బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభిస్తారు. ఈ కొత్త మెట్రో మార్గం బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు బెంగళూరు ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను అందించడమే కాకుండా, నగర ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుస్తాయి.
Read Also : Non Veg : జులైలో తగ్గిన నాన్ వెజ్ భోజనం ఖర్చులు