ఆలయం మొదలుకుని దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో ఏటేటా అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. రామేశ్వరానికి వెళ్లనున్నారాయన. చారిత్రాత్మక రామనాథస్వామివారి ఆలయాన్ని సందర్శించనున్నారు.

దక్షిణ రైల్వే వెల్లడి
అదే రోజున పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం ఇవ్వనున్నారు మోదీ. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ పూర్తయింది. ఈ విషయాన్ని దక్షిణ రైల్వే వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 2019లో ఆయనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి ఏడాదిలో నిర్మాణ పనులు ఆరంభం అయ్యాయి. ఈ క్రమంలో పాంబన్ బ్రిడ్జి పునర్నిర్మించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దారు. పాంబన్ బ్రిడ్జి పొడవు 2.07 కిలోమీటర్లు. దేశంలో నిర్మితమైన మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి ఇదే. వర్టికల్ లిఫ్ట్ ఎత్తు 72 మీటర్లు. 17 మీటర్ల ఎత్తు ఉన్న నౌకలు దీని కింది నుంచి రాకపోకలు సాగించగలవు. అంటే- నౌకలు వచ్చినప్పుడు వర్టికల్‌గా ఈ బ్రిడ్జిని పైకి లిఫ్ట్ చేస్తారు.
1914లో పాత పాంబన్ వంతెన నిర్మాణం పూర్తయింది. కాలక్రమేణ అది ధ్వంసమౌతూ వచ్చింది. సముద్రపు ఉప్పు నీటికి తుప్పు పట్టడం వల్ల 2022లో దీనిని మూసివేశారు. సముద్ర మట్టం నుండి 3 మీటర్ల ఎత్తు ఉంటుందీ కొత్త పాంబన్ బ్రిడ్జి. స్పాన్‌ల సంఖ్య.. 100. 99 స్పాన్‌లు 18.3 మీటర్లు ఉంటాయి. ఒక స్పాన్ 72.5 మీటర్లు. హై-స్ట్రెంగ్త్ స్టీల్, మెరైన్-గ్రేడ్ కాంక్రీట్‌ను దీని నిర్మాణంలో వినియోగించారు.
READ ALSO: CM Revanth Reddy : ఈనెల 15న జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి