మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

Donald Trump: మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

మోడీ అమెరికా పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరికొంతమంది దేశాధ్యక్షులు కూడా వస్తారని, వాళ్లు వచ్చిన సమయంలో వాషింగ్టన్‌ డీసీ సుందరంగా మారిపోవాలని, నగరంలో టెంట్లు, గోడలపై గ్రాఫిటీలు, రోడ్లపై గుంతలు కనిపించడానికి వీలు లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాషింగ్టన్‌ డీసీలో రోడ్డు పక్కల టెంట్లు, గోడలపై పిచ్చి పిచ్చి గ్రాఫిటీలు మోదీ తదితరులు చూడాలని నేను అనుకోవడం లేదంటూ ట్రంప్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీని శుభ్రం చేయాలని అనుకుంటున్నామని ట్రంప్‌ పేర్కొన్నారు.


రహిత నగరంగా వాషింగ్టన్‌ డీసీ
అలాగే నేర రహిత నగరంగా వాషింగ్టన్‌ డీసీని చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చే వారెవరూ తాము భద్రంగా ఉంటామనే భావనను కలిగి ఉండాలని, ఇక్కడ ఎలాంటి క్రైమ్‌లు జరగకుండా చూస్తామని అన్నారు. అందుకోసమే నగరాన్ని శుభ్రం చేస్తున్నాం. ఇప్పటికే టెంట్లు తొలగించాం. అలాగే గ్రాఫిటీలను కూడా తొలగిస్తాం. అందుకు మాకు పెద్దగా సమయం పట్టదు అంటూ ట్రంప్‌ వెల్లడించారు. కాగా, ప్రధాని మోదీ ఇటీవలె అమెరికాలో పర్యటించి, ప్రెసిడెంట్‌ ట్రంప్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు దేశాల అధినేతలో వైట్‌ హౌస్ లో వరుసగా సమావేశం అవుతున్నారు.
వాషింగ్టన్‌ డీసీని క్లీన్‌గా వుంచండి
ఇప్పటికే మోదీతో పాటు ఉక్రెయిన్‌, యూకే, జోర్దాన్‌ దేశాధ్యక్షులతో కూడా ట్రంప్ భేటీ అయ్యారు. ఇక మరోసారి ప్రధాని మోదీతో పాటు, యూకే ప్రధానితో కూడా ట్రంప్ భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే వారి రాక సమయంలో వాషింగ్టన్‌ డీసీ క్లీన్‌గా ఉండాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఫిబ్రవరి 13న ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం ప్రధాని మోదీ వైట్‌హౌస్‌ను సందర్శించారు.

Related Posts
మహాకుంభ్‌లో యూపీ ప్రభుత్వం ప్రత్యేక కేబినెట్‌ సమావేశం
up cabinet

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభ్‌లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. మధ్యాహ్నం సభ జరుగుతుందని, అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర మంత్రులతో కలిసి మహా Read more

షేక్ హసీనాను వెనక్కి పంపండి: బంగ్లాదేశ్
షేక్ హసీనాను వెనక్కి పంపండి: బంగ్లాదేశ్

షేక్ హసీనా ని తిరిగి పంపించాలని: భారతదేశానికి బంగ్లాదేశ్ తాజా లేఖ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5 నుండి భారతదేశంలో ప్రవాస జీవితం Read more

సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు
PM Modi wishes CM Revanth Reddy on his birthday

హైదరాబాద్‌: ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి నల్లగొండి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట యాదాద్రి ఆలయానికి Read more

మరో 487 వలసదారుల బహిష్కరణ
మరో 487 వలసదారుల బహిష్కరణ

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయ వలసదారులను త్వరలో బహిష్కరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వానికి తెలియజేశారని, వారిపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *