పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ చర్చ హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఆపరేషన్ ప్రధానంగా మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం జరిగిందని ఆరోపించారు. దేశ భద్రత కంటే ఇమేజ్‌కి ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.భారత్-పాకిస్థాన్ ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కాల్పుల విరమణ తన ఘనతే అని ట్రంప్ చెప్పారని అన్నారు. వాణిజ్యాన్ని సాధనంగా ఉపయోగించానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోదీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ను అబద్ధాలకోరు అని మోదీ ప్రకటించాలన్నారు. ఒక దేశాధినేత మన వ్యవహారాలపై మాట్లాడితే, ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యమని అన్నారు.

పాకిస్థాన్ జనరల్‌తో ట్రంప్ భేటీపై విమర్శ
పాకిస్థాన్ జనరల్ ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ భేటీపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి మునీర్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ట్రంప్ కలిసినా ప్రధాని మౌనంగా ఉండటం ఎందుకని ప్రశ్నించారు.దేశ భద్రత వంటి సున్నితమైన విషయాల్లో ప్రధాని మౌనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని గాంధీ అన్నారు. ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాని పై ఉందని పేర్కొన్నారు.
కెప్టెన్ శివకుమార్ వ్యాఖ్యలు
ఈ వివాదంపై ఇండోనేషియాలోని భారత రక్షణ శాఖ అటాషే కెప్టెన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలను కూడా రాహుల్ ప్రస్తావించారు. రాజకీయ నాయకత్వ పరిమితులు వల్లే పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడి చేయలేకపోయామని ఆయన చెప్పారని గుర్తుచేశారు.శివకుమార్ వ్యాఖ్యలు దేశ భద్రతపై రాజకీయ నాయకత్వం పాత్రపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని గాంధీ అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీ ప్రసంగం లోక్‌సభలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన విమర్శలు ప్రధానంగా మోదీ బాధ్యతారాహిత్యంపై కేంద్రీకృతమయ్యాయి.
Read Also : Priyanka Gandhi : యుద్ధాన్ని ఎందుకు ఆపారు?.. లోక్‌సభలో ప్రశ్నించిన ప్రియాంక గాంధీ