chandrbabu naidu

మంత్రులకు సీఎం దిశా నిర్దేశం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం జరిగిన తరువాత మంత్రులతో వేరుగా భేటీ అయ్యారు.పలు కీలక అంశాలను పేర్కొన్నారు. అందరూ గేర్ మార్చాలని.. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు . మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్‌పై పెర్ఫార్మెన్స్‌ను సీఎం చదివి వినిపించారు. మొదటి ఆరునెలలు పర్వాలేదని…. ఇక ఊరుకునేది లేదన్నారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో సాక్షాత్తు ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారు. శాఖలపరంగా ఇక మీరు పెర్ఫార్మెన్స్ పెంచాలి. అందరు గేర్ అప్ కావాలి. కేంద్ర బడ్జెట్ వచ్చింది.. మార్చ్‌లో మన బడ్జెట్ వస్తుంది. ఢిల్లీలో వివిధ శాఖల్లో మిగిలిపోయిన బడ్జెట్ ఉంటుంది.. ఆ నిధులను మనం తెచ్చుకోవాలి’’ అని సూచించారు.సచివాలయం సిబ్బందిలో ఐదుగురికి ఎంపిక చేసి ఒక్కో మండలానికి ఒక్కొక్కరిని పెట్టుకోవాలని.. వీళ్ళకు ఒక ప్రొఫెషనల్ ఉంటారని.. వీళ్ళకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారని తెలిపారు. వీళ్లు జీఎస్‌డీపీపై దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపారు. వాట్స్‌ ఆప్ గవరెన్స్‌కు మంచి స్పందన వస్తుందని అన్నారు.

andhra pradesh chief minister n chandrababu naidu 202924716 16x9 0

రెగ్యులర్‌గా సర్వేలు చేయిస్తున్నానని.. అన్ని పథకాలపై ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందన్నారు. దీనిని ఇంకా మరింత పెంచుకోవాలని చెప్పారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంకాక ముందే తల్లికి వందనం నిధులు వేస్తామని.. అలాగే డీఎస్సీ నియామకాలను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ద్రవ్యోల్బణంపై ఆర్థికశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ రెగ్యులర్‌గా మానిటరింగ్ జరిగాలన్నారు. దావోస్‌లో గ్రీన్‌ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీతో పాటు వివిధ అంశాలపై మంచి ఫీడ్ బాక్ వచ్చింది.. మన బ్రాండ్ ఇమేజ్ బాగుందని మంత్రులకు సీఎం చెప్పారు. పీఎం కిసాన్ క్రింద కేంద్రం ఇచ్చే రూ. 6వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.14వేలు కలిపి ‘ అన్నదాత సుకీభవ ‘ అందిస్తామని సీఎం తెలిపారు.

Related Posts
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భారతీయుల మృతి
Russia Ukraine war.. Indian

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న వీరిలో ఇంకా 16 మంది అదృశ్యంగా ఉన్నారని Read more

సాధారణ మెజారిటీతో జమిలికి అనుమతి
Jamili Elections bill

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును జాయింట్ పార్లమెంట్‌ కమిటీ (JPC) కి పంపడానికి లోక్‌సభ అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో ఓటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా Read more

హైదరాబాద్​లో పెరుగుతున్న ఫుడ్​ పాయిజనింగ్ కేసులు
Food poisoning

హైదరాబాద్ మహానగరంలో చాలామంది ఇంట్లో తినడం మానేశారు. బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయి..వంట చేసుకొని తినే బదులు , వంద పెట్టి బయట తింటే సరిపోతుందికదా Read more

ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించాం: సీఎం
We are determined to make AP clean.. CM Chandrababu

కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో Read more