టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని హిట్ 3 సినిమా మీద మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. టాక్ ఎలా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం అదిరిపోతోన్నాయి. బరిలో మరేతర చిత్రం లేకపోవడం మరింతగా కలిసి వచ్చింది. ఇప్పుడు థియేటర్లన్నీ కూడా హిట్ 3తోనే నిండిపోతోన్నాయి. నాని విధ్వంసానికి బాక్సాఫీస్ భయపడిపోతోంది. శైలేష్ కొలను రైటింగ్ ఎలా ఉన్నా కూడా నాని తన పర్ఫామెన్స్‌తో సినిమా నిలబెట్టేశాడని అంటున్నారు. ఇంత వైయలెంట్‌గా నానిని ఎప్పుడూ చూడలేదని ఫాన్స్ అంటున్నారు.ఇక ఈ హిట్ 3 గురించి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అందులో బీజీఎం గురించి కొంత మంది కాస్త ఎక్స్ ట్రానే మాట్లాడుకుంటూ వచ్చారు. బీజీఎం సరిగ్గా లేదని, చాలా చోట్ల ఎలివేషన్స్ ఇవ్వలేదని అంటున్నారు. అయితే దీనిపై శైలేష్ కొలను కూడా స్పందించాడు. మ్యూజిక్ ఎక్కడ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడని, తన టాలెంట్ చూపించాలని, సీన్ వ్యాల్యూ తగ్గించి మరీ తన బీజీఎంను ఇవ్వలేదని, ఏ సీన్‌కు ఎక్కడ ఎంత ఇవ్వాలో అంత అద్భుతంగా ఇచ్చాడని అన్నాడు.
విమర్శల
ఈ విమర్శల మీద మిక్కీ జే మేయర్ స్పందించాడు. ‘హ్యాపీ డేస్ మ్యూజిక్, కొంత మందికి వినిపించినప్పుడు. అది అసలు మ్యూజిక్కేనా? అక్కడక్కడ పియానో, గిటార్ మాత్రమే వాయించారేంటి?అని చాలా మంది అన్నారు. కానీ అది చివరకు ఓ క్లాసిక్ అయింది.నేను దర్శకుడికి ఏం కావాలో ఎంతో కావాలో ఇస్తాను నేను ఎప్పుడూ నా పని మీదే ఫోకస్డ్‌గా ఉంటాను ఇలాంటి విమర్శల మీద ఎప్పుడూ రియాక్ట్ అవ్వను. ఇప్పుడు ఇలా రియాక్ట్ అవుతున్నాను నా మ్యూజిక్ అందరికీ నచ్చకపోవచ్చు కొందరు దాన్ని విమర్శించొచ్చు.. విమర్శించే పద్దతి కూడా ఉంటుంది, సద్విమర్శల్ని నేను కూడా తీసుకుంటాను నేను చేస్తున్న ఈ పని దర్శకులకు అనుగుణంగా ఉంటుంది, వారేం కావాలంటే అది ఇస్తాను, నేను అందరినీ మెప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను, నేను ఆ జీసెస్ వల్ల, తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాల వల్లే ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చాను నేను ఇక చేయలేను అని అన్న రోజున మ్యూజిక్ ఆపేస్తాను.. కానీ అప్పటి వరకు నేను అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు, మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా’ అని అన్నాడు. హిట్ 3 చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.
కలెక్షన్లు
కాగా,’హిట్ 3′ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మే 1న రిలీజ్ అయిన సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. టాలీవుడ్‌లోనే కాదు ఓవర్సీస్‌లో కూడా నాని సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఒక్కో సినిమాతో బ్రాండ్ వ్యాల్యూ పెంచుకుంటూ పోతున్నాడు.నార్త్ అమెరికాలో మంచి వసూళ్లు రాబట్టే హీరోలలో తానూ ఒకడినని మళ్లీ నిరూపించాడు. ఇక్కడ ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమా 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.13 కోట్లు) మార్కును దాటింది. ఈ ప్రాంతంలో 1 మిలియన్ డాలర్లు కలెక్షన్లు సాధించిన నాని 11వ సినిమాగా రికార్డు నెలకొల్పింది.ఓవర్సీస్‌లో తొలి రోజే వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఈ వీకెండ్‌లో సులువుగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అలానే హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.43 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. నాని కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది.
Read Also : Black White and Grey: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న’బ్లాక్ వైట్ అండ్ గ్రే .. లవ్ కిల్స్’