తెలంగాణ రాష్ట్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో మరోసారి ముందంజలో ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్, మే నెలల్లోనే 4.54 కోట్ల పనిదినాలు పూర్తికావడం విశేషం. ఈ ఏడాదికి కేంద్రం కేటాయించిన 6.50 కోట్ల పనిదినాల లక్ష్యంలో ఇది సుమారు 70 శాతానికి సమానం. మిగిలిన 30 శాతం పనిదినాలు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో మరోసారి ముందంజలో ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్, మే నెలల్లోనే 4.54 కోట్ల పనిదినాలు పూర్తికావడం విశేషం. ఈ ఏడాదికి కేంద్రం కేటాయించిన 6.50 కోట్ల పనిదినాల లక్ష్యంలో ఇది సుమారు 70 శాతానికి సమానం. మిగిలిన 30 శాతం పనిదినాలు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
పనిదినాలను పూర్తి
గత రెండు నెలల్లో ఈ పథకం కింద 18.9 లక్షల కుటుంబాల్లోని 28.48 లక్షల మంది కూలీలకు పని కల్పించారు. ఒక్కో కుటుంబం సగటున 24 రోజుల పనిదినాలు పూర్తిచేయగా 1,127 కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నాయి. సగటున ఒక్కో కూలీకి రోజువారీ వేతనంగా రూ.250.75 లభించింది, ఇది కూలీల జీవనోపాధికి గణనీయంగా తోడ్పడింది. మే నెలాఖరుకు పూర్తయిన పనులలో వ్యవసాయ అనుబంధ పనులు (Agricultural allied works) 50 శాతంగా నమోదయ్యాయి. నీటి కుంటలు, పశువుల కొట్టాలు, మొక్కలు నాటడం వంటి లక్షకు పైగా పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

అధికార వర్గాలు
గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి 1.31 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయి. మే (May) నెలాఖరు నాటికి ఈ పథకం ద్వారా రూ.1,416 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.1151.67 కోట్లు వేతనాల రూపంలో చెల్లించగా రూ.191.03 కోట్లు సామగ్రి కోసం వ్యయమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం నెలాఖరుకు పూర్తవుతున్న నేపథ్యంలో, ఆ తర్వాత చేపట్టే పనులకు కేంద్రం అనుమతి ఉండదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పనిదినాలను 12 కోట్లకు పెంచాలని కేంద్రాన్ని అభ్యర్థించాలని భావిస్తోంది.
Read Also: Rythu Bharosa : నేడు ‘రైతు భరోసా’ సంబరాలు – మంత్రి పొంగులేటి