రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం భార్యతో కలిసి మేఘాలయకు వెళ్లిన రాజా అక్కడే అమానుషంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అతడి భార్య సోనమ్ రఘువంశీతో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నిందితులను మేఘాలయ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.పోలీసులు నిందితులకు మాస్క్ లు తొడిగి తీసుకెళుతుండగా ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిందితులలో ఒకడి చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేఘాలయ పోలీసులు నలుగురు నిందితులను విమానాశ్రయంలోకి తీసుకెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
నలుగురు నిందితులను
రాజా రఘువంశీ హత్య పట్ల ఆ ప్రయాణికుడు తన ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిందితులు మాస్కులు ధరించి ఉండటంతో ఎవరికి దెబ్బ తగిలిందనేది తెలియరాలేదు. రాజా రఘువంశీ(Raja Raghuvanshi) హత్య కేసులో అరెస్టయిన రాజ్ కుశ్వాహా, విశాల్ చౌహాన్, ఆకాశ్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మీ అనే నలుగురు నిందితులను మేఘాలయ పోలీసుల 12 మంది సభ్యుల బృందం స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ కస్టడీ పొంది షిల్లాంగ్‌కు తీసుకువెళ్లిందని ఇండోర్ అదనపు డీసీపీ రాజేష్ దండోతియా తెలిపారు.
Read Also: Supreme Court: యాజమాన్యానికి పూర్తిస్థాయి పట్టాలుండాల్సిందేనన్న సుప్రీం