chiru tweet

చరణ్ పై మెగాస్టార్ ప్రశంసలు

గేమ్ ఛేంజర్ మూవీ లో రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. ‘నిజాయితీ కలిగిన అప్పన్నగా, ఐఏఎస్ అధికారి రామ్నందన్గా చరణ్ అద్భుతంగా నటించారు. అతనికి వస్తున్న అభినందనలు చూసి సంతోషంగా ఉంది. నటీనటులు, నిర్మాత రాజు, దర్శకుడు శంకర్, మూవీ బృందం అందరికీ కంగ్రాట్స్’ అని పేర్కొన్నారు.

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ ఈరోజు జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది.

సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. స్టోరీ టెల్లింగ్, స్టెల్లర్ ఫెర్ఫార్మెన్స్, టాప్ ఫెర్ఫార్మెన్స్, అద్బుతమైన సినిమాటిక్ ఎక్సీపిరియెన్స్‌ మూవీకి అదనపు ఆకర్షణ. రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంది. ఎస్‌జే సూర్య అవుట్ స్టాండింగ్. కియారా అద్వానీ, అంజలి ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. IASగా చరణ్ లుక్, యాక్టింగ్ అదిరిపోయాయని, ఇంటర్వెల్లో ఊహించని ట్విస్ట్ సెకండాప్ హాఫ్ ఫై మరింత హైప్ పెంచుతుంది. కమెడియన్లందరూ ఉన్నా కామెడీ లేకపోవడం మైనస్. తమన్ BGM బాగుందని ఇలా నెటిజన్లు ఎవరికీ వారు రివ్యూలు ఇస్తున్నారు. ఓవరాల్ గా ‘గేమ్ ఛేంజర్’ ఒక మాస్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాను చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని పేర్కొంటున్నారు. ఇటు సినిమా ప్రముఖులు సైతం సినిమా బాగుందంటూ కితాబు ఇస్తూ, చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *