हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Medak: కోర్టు భవనంపై నుంచి దూకిన ఫ్యామిలీ ఎందుకంటే?

Anusha
Medak: కోర్టు భవనంపై నుంచి దూకిన ఫ్యామిలీ ఎందుకంటే?

మెదక్ జిల్లా కేంద్రంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఓ జంట తమ ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో భార్య రాజమణి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త నవీన్‌గౌడ్‌తో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి (Medak Government Hospital) లో చికిత్స పొందుతున్నారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం,రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌కు చెందిన రాజమణి, బాలరాజ్‌గౌడ్‌ దంపతుల కుమార్తె రమ్య (24) ను ఏడేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన నవీన్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు.వీరికి రుత్విక, శశ్విక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నవీన్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్నేళ్లుగా రమ్య, నవీన్‌ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఆరు నెలల క్రితం జరిగిన ఒక గొడవలో రమ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.

అతని బైక్, సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు

ఆ సమయంలో నవీన్‌, రమ్య నివాసం ఉంటున్న ఇంటిపై బాంబులు వేసి భయాందోళనకు గురిచేశాడు. దీనిపై రమ్య బంధువులు రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, నవీన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో అతను మూడు నెలలు జైలు జీవితం గడిపాడు.నవీన్‌ జైలు నుంచి విడుదలయ్యాక, పెద్దలు జోక్యం చేసుకొని దంపతులకు రాజీ కుదిర్చారు. దీంతో ఇద్దరూ మళ్లీ కలిసి జీవించడం మొదలుపెట్టారు. నవీన్‌ (Naveen) పై ఉన్న కేసు విచారణ సందర్భంలో పోలీసులు అతని బైక్, సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. వాటిని తిరిగి పొందేందుకు అవసరమైన ఉత్తర్వుల కోసం నవీన్‌ శనివారం సాయంత్రం తన భార్య, పిల్లలతో కలిసి మెదక్‌ కోర్టుకు వెళ్లాడు.అక్కడ దంపతుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

Medak: కోర్టు భవనంపై నుంచి దూకిన ఫ్యామిలీ ఎందుకంటే?
Medak

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

ఈ వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో, వారు ఆగ్రహంతో కోర్టు భవనంపై నుంచి తమ ఇద్దరు పిల్లలను కిందకు తోసి, ఆ తర్వాత వారు కూడా దూకి ఆత్మహత్య (Suicide) కు ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి చీకటి పడ్డాక జరిగిన ఈ ఘటనను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాయపడిన నవీన్‌తో పాటు పిల్లలిద్దరినీ అత్యవసరంగా హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెదక్‌ సీఐ మహేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: Kavitha PA: ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత పీఏ పేరు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870