हिन्दी | Epaper

Rice: పేద పిల్లలకు సన్న బియ్యంతో భోజనం

Vanipushpa
Rice: పేద పిల్లలకు సన్న బియ్యంతో భోజనం

పక్కదారి పట్టకుండా సంచులపై క్యూ ఆర్ కోడ్

విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ(Kasturibagandhi) బాలికా విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విధ్యార్ధులకు రుచికరమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి పేద పిల్లల(Poor Childrens)కు సన్న బియ్యంతో భోజనం వడ్డించనున్నారు. ఈ నెల 12న బడుల్లో సన్న బియ్యం అందచేత కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. బియ్యాన్ని 25 కేజీల సంచిలో ప్యాకింగ్ చేసి పంపిణీ చేస్తారు.

Rice: పేద పిల్లలకు సన్న బియ్యంతో భోజనం
Rice: పేద పిల్లలకు సన్న బియ్యంతో భోజనం

బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు
బస్తాపై రాజకీయ నేతల చిత్రాలు లేకుండా ఇద్దరు చిన్నారుల ఫొటో, పాఠశాల, దానిపై జాతీయ జెండా ఎగురుతున్నట్లు చిత్రం, ప్రభుత్వ లోగోను ముద్రించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, బడి బయట పిల్లల కోసం నిర్వహించే వసతి గృహాలకు సకాలంలో బియ్యం సరఫరా చేసే భాధ్యతలను మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి. శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ బియ్యంలో మైక్రోన్యూట్రియంటుల సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బియ్యం నాణ్యతపై ప్రధానోపాధ్యాయుల నుంచి స్టార్ రేటింగ్ రూపంలో అభిప్రాయం స్వీకరిస్తారు. మండలస్థాయి గిడ్డంగుల నుంచి నేరుగా బడులకు చేరవేస్తారు. ప్రతి బస్తాపైన క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. స్టాక్ తీసుకున్నప్పుడు ప్రధానోపాధ్యాయులు కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఏ బస్తాను ఎక్కడ వినియోగిం చాలన్న వివరాలు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టరేట్లో ఉంటాయి.

Read Also: CRS : ఏపీలో జననాలు తగ్గి, మరణాలు పెరుగుతున్నాయ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

📢 For Advertisement Booking: 98481 12870