OTT :ఓటీటీలోకి వచ్చేసిన మజాకా మూవీ..

OTT :ఓటీటీలోకి వచ్చేసిన మజాకా మూవీ..

కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మజాకా’ సినిమాలో సందీప్ కిషన్,రావు రమేష్,రీతూ వర్మ, అన్షు నటించారు.‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్, ‘భైరవకోన’తో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మజాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో రావు రమేష్ కీలక పాత్ర పోషించగా, శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మజాకా మూవీ థియేటర్లలో మంచి విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. సినిమా మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది.విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలగలిపిన వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఓటీటీ

థియేటర్లలో ఐదు వారాల పాటు విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం మార్చి 28న జీ5 ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో సైలెంట్‌గా విడుదల చేశారు. ఉగాది, రంజాన్ పండగల సందర్భంగా కుటుంబంతో కలిసి ఆస్వాదించేందుకు ‘మజాకా’ అందుబాటులోకి వచ్చింది.

కథ

కృష్ణ (సందీప్ కిషన్) తన తండ్రి వెంకట రమణ (రావు రమేష్)తో కలిసి జీవిస్తున్నాడు. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో ఇంట్లో ఆడదిక్కు లేకుండా బ్రతికేస్తున్నారు. కొడుక్కి పెళ్లి చేయాలని ఆరాటపడే తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా, వారి ఇంట్లో ఆడవాళ్లు లేరనే కారణంగా అమ్మాయిల తల్లిదండ్రులు తిరస్కరిస్తుంటారు.ఈ నేపథ్యంలో, తానే పెళ్లి చేసుకుంటే కొడుకు పెళ్లికి మార్గం సులభం అవుతుందనే ఆలోచనతో వెంకట రమణ యశోద (అన్షు) ప్రేమలో పడతాడు. ఇదే సమయంలో కృష్ణ కూడా మీరా (రీతూ వర్మ)తో ప్రేమలో పడతాడు. అయితే వీరి ప్రేమలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారు? తండ్రి-కొడుకు పెళ్లి అయినా జరిగిందా? అనేది మిగతా కథ.

హైలైట్

ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్‌లో మైలురాయి అయిన 30వ చిత్రంగా నిలిచింది. సందీప్ కిషన్ కామెడీ టైమింగ్, యాక్షన్, రొమాన్స్ బలమైన ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. రావు రమేష్ పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో, ఆయన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.

et00413068 nfafzwygns landscape (1)

మూవీ హైలైట్స్

కామెడీ ఎమోషనల్ ఎలిమెంట్స్ కలిసిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్,సందీప్ కిషన్ – రావు రమేష్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది,తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, ప్రేమకథలు వినోదంగా చూపించారు,

నటీనటులు

రావు రమేష్ – ఈ చిత్రంలో హైలైట్. ఆయన నటన సహజంగా, హాస్యాన్ని పెంచేలా ఉంది. కానీ, కొన్ని సన్నివేశాల్లో అతిగా అనిపించింది.రీతూ వర్మ, అన్షు – కథలో ఫర్వాలేదనిపించినా, ప్రాధాన్యత తక్కువగా అనిపిస్తుంది.మురళీ శర్మ – భర్గవ్ శర్మ పాత్రలో ఆకట్టుకున్నాడు.సంగీతం – లియోన్ జేమ్స్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకునే స్థాయిలో లేదు.కథ, మాటలు – రచయిత ప్రసన్న కుమార్ చాలా రొటీన్ సన్నివేశాలను రాశాడు.దర్శకత్వం – త్రినాథరావు నక్కిన కథను సరైన ఎమోషనల్ బ్యాలెన్స్‌తో తెరకెక్కించలేకపోయారు.

Related Posts
Dolby Vision theater | హైదరాబాద్‌లో డాల్బీ విజన్ థియేటర్‌కు పాపులర్ నిర్మాత ప్లాన్‌.. పుష్ప 2 ది రూల్‌ కోసమేనా ఏంటి
theatre movies

డాల్బీ విజన్ థియేటర్ | వినోద ప్రపంచంలో ప్రతిసారీ కొత్త టెక్నాలజీ ప్రవేశించడం అనేది సహజం. సినిమాటిక్ అనుభూతిని మరింత మెరుగుపరచడంలో ఈ టెక్నాలజీలు కీలక పాత్ర Read more

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ
పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి కేసుల చిక్కులు ఇప్పట్లో తీరేలా లేవు.ఒక కేసులో బెయిల్ రావడంతో ఊపిరిపీల్చుకునేలోపే, మరో కేసులో Read more

ఓటీటీలో సందడికి ఈ సినిమాలు రెడీ
ఓటీటీలో సందడికి ఈ సినిమాలు రెడీ.

ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న హిట్ సినిమాలు మరియు సిరీస్‌లు ఈ వారం డిజిటల్ వేదికలో బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రేక్షకులకు అనేక ఆసక్తికరమైన సినిమాలు, Read more

ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో
ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో

సలార్, కల్కి వంటి భారీ విజయాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మరో అంచనాల సినిమాతో రాబోతున్నాడు. అది కూడా రొమాంటిక్ హారర్ కామెడీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *