అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) ముందు పైలట్ “మేడే కాల్” పంపినట్లు అధికారులు వెల్లడించారు. విమానమై ప్రయాణికుల భద్రత ప్రమాదంలో ఉందని పైలట్ గుర్తించిన వెంటనే అత్యవసర సంకేతంగా ఈ మేడే కాల్ ఇచ్చారు. ఇది విమాన, నౌకాయాన రంగాల్లో అత్యంత అత్యవసర సహాయ సంకేతంగా పరిగణిస్తారు.
‘మేడే మేడే’ అంటే ఏమిటి?
‘మేడే’ (Mayday) అనేది ఫ్రెంచ్ పదమైన “M’aider” నుండి ఉద్భవించింది, దాని అర్థం “సహాయం చేయండి”. ఈ పదాన్ని 1920ల నుంచి ప్రపంచవ్యాప్తంగా విమాన, నౌకా రవాణా వ్యవస్థలు ఉపయోగిస్తున్నాయి. ఒక విమానం లేదా నౌక ప్రమాదంలో ఉంటే, పైలట్ లేదా కెప్టెన్ రేడియో ద్వారా “Mayday Mayday Mayday” అని మూడు సార్లు చెబుతారు. వెంటనే సమీప ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) లేదా నౌకాశ్రయం అప్రమత్తమవుతుంది. అలా వెంటనే సహాయక చర్యలు ప్రారంభమవుతాయి.
విమాన భద్రతలో మేడే కాల్ ప్రాధాన్యత
‘మేడే కాల్’ ఒక విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇచ్చే కీలక సంకేతం. ఇది ఏ మామూలు కమ్యూనికేషన్ కాల్ కాదు. ఇది పైలట్ జీవితం మీద, ప్రయాణికుల భద్రత మీద తీవ్రమైన ముప్పు ఉన్నదనే సూచన. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కూడా పైలట్ చివరి నిమిషంలో మేడే కాల్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో ఏ పరిస్థితుల మధ్య ఆ కాల్ ఇచ్చారన్నది ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. అయినప్పటికీ, ఈ సంకేతం వల్ల కనీసం ఘటన తీవ్రతను ముందు అంచనా వేయడం సాధ్యమవుతుంది.
Read Also : Green Gram : పెసలు స్నాక్స్‌లాగా తింటే ఎంతో మేలు..!