అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన

America: అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు సోమవారం డాలస్‌లో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్బంధించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వీరంతా దేశభక్తి, ఐకమత్యాలను చాటుకునేందుకు అమెరికా జెండాలని పట్టుకుని నినాదాలు చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇటీవల ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ విశ్వవిద్యాలయాల నుంచి అరెస్టయిన వారిని గుర్తు తెచ్చే బ్యానర్లను కూడా పట్టుకున్నారు.

Advertisements
అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన

మూడోసారి అధికారం అంత సులభం కాదు!
రాజ్యాంగం అనుమతించక పోయినా డొనాల్డ్‌ ట్రంప్‌ మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టించి, తర్వాత దానిని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మీకు బదిలీ చేస్తారా? అన్న ఒక ప్రశ్నకు అదీ ఒక పద్ధతని ట్రంప్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే మూడోసారి అధ్యక్షుడు కావడం అంత సులభం కాదని.. అమెరికా అధ్యక్షుని ఎన్నికపై ఉన్న రెండు దఫాల నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణతో పాటు మెజారిటీ రాష్ర్టాల ఆమోదం అవసరం అని నిపుణులు చెప్తున్నారు.
అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ హడలగొడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆ సుంకాల అమలుకు పెట్టిన డెడ్‌లైన్‌ ఏప్రిల్‌ 2వ తేదీ గడువు సమీపిస్తున్న వేళ మరో పిడుగులాంటి హెచ్చరిక చేశారు. సుంకాల విధింపు కొన్ని దేశాలకే పరిమితం కాదని, తమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాణిజ్య సంబంధాలు జరుపుతున్న దేశాలన్నింటికీ ఈ టారిఫ్‌లు అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అర్కిటిక్‌ ద్వీపం దక్కదని గ్రీన్‌లాండ్‌ కొత్త ప్రధాని నీల్సన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ట్రంప్‌ ప్రకటనపై ఆయన స్పందిస్తూ ‘మేం మరెవరీకి చెందిన వారం కాదు.

Related Posts
ఇండోర్‌లో క్రికెట్ జట్టు విజయోత్సవ ఊరేగింపులో మత హింసలు
ఇండోర్‌లో క్రికెట్ జట్టు విజయోత్సవ ఊరేగింపులో మత హింసలు

ఆదివారం అర్థరాత్రి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని మోవ్ పట్టణంలోని కొన్ని మతపరంగా సున్నితమైన ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజయాన్ని Read more

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్..
Donald Trump as the 47th President of America

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ మేరకు అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొనున్నారు. Read more

స్పేస్‌ఎక్స్ ఆరవ స్టార్షిప్ పరీక్షా ప్రయోగం
space x

స్పేస్‌ఎక్స్ తన స్టార్‌షిప్ లాంచ్ వాహనానికి సంబంధించిన ఆరవ పరీక్షా ప్రయోగం ఈ రోజు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇది అక్టోబర్ 13, 2024 న జరిగిన 5వ Read more

భారత్ ఎక్కడ ఆడినా గెలుస్తుంది: వసీం అక్రమ్
భారత్ ఎక్కడైనా గెలుస్తుంది ! వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు

భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌లో ఆడి గెలవడం క్రికెట్ ప్రపంచంలో ప్రధాన చర్చనీయాంశమైంది. భారతదేశం పాకిస్తాన్‌లో ఆడకపోవడం కొందరికి లాభదాయకంగా అనిపించగా, మరికొందరు ఇది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×