అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు సోమవారం డాలస్‌లో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరంతా దేశభక్తి, ఐకమత్యాలను చాటుకునేందుకు అమెరికా జెండాలని పట్టుకుని నినాదాలు చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇటీవల ప్రతిష్ఠాత్మక అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి అరెస్టయిన వారిని గుర్తు తెచ్చే బ్యానర్లను కూడా పట్టుకున్నారు.

మూడోసారి అధికారం అంత సులభం కాదు!
రాజ్యాంగం అనుమతించక పోయినా డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టించి, తర్వాత దానిని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మీకు బదిలీ చేస్తారా? అన్న ఒక ప్రశ్నకు అదీ ఒక పద్ధతని ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే మూడోసారి అధ్యక్షుడు కావడం అంత సులభం కాదని.. అమెరికా అధ్యక్షుని ఎన్నికపై ఉన్న రెండు దఫాల నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణతో పాటు మెజారిటీ రాష్ర్టాల ఆమోదం అవసరం అని నిపుణులు చెప్తున్నారు.
అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ హడలగొడుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఆ సుంకాల అమలుకు పెట్టిన డెడ్‌లైన్ ఏప్రిల్ 2వ తేదీ గడువు సమీపిస్తున్న వేళ మరో పిడుగులాంటి హెచ్చరిక చేశారు. సుంకాల విధింపు కొన్ని దేశాలకే పరిమితం కాదని, తమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాణిజ్య సంబంధాలు జరుపుతున్న దేశాలన్నింటికీ ఈ టారిఫ్‌లు అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అర్కిటిక్ ద్వీపం దక్కదని గ్రీన్‌లాండ్ కొత్త ప్రధాని నీల్సన్ స్పష్టం చేశారు. శుక్రవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ట్రంప్ ప్రకటనపై ఆయన స్పందిస్తూ ‘మేం మరెవరీకి చెందిన వారం కాదు.