సొంత కారు ఉండాలి అనేది చాల మంది కోరిక. అయితే మార్కెట్లో మధ్యతరగతి నుండి సంపన్నుల వరకు అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ధరలకు చాల కంపెనీల కార్లు. కానీ చాలమందికి తక్కువ మెయింటెనెన్స్ కార్ల గురించి ప్రస్తావన వచ్చినపుడు మారుతి సుజుకి పేరు వినిపిస్తుంది. అయితే ఇండియాలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయినా మారుతి సుజుకి కస్టమర్లకు షాకిస్తూ పెద్ద ప్రకటన చేసింది. దింతో కొత్త కారు కొనాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లింది. కంపెనీ తాజాగా వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుండే ఈ పెంపు అమల్లోకి రానుంది.
ఈ వార్త వెలువడిన వెంటనే మారుతి సుజుకి లిమిటెడ్ షేర్లు బిఎస్ఇలో జోరందుకున్నాయి. దింతో మారుతి షేరు ధర ప్రస్తుతం రూ.11766 వద్ద ట్రేడవుతోంది.

పెరగనున్న మారుతి సుజుకి కార్ల ధరలు
మారుతి సుజుకి ఇండియా ఏప్రిల్ 2025 నుండి కంపెనీ కార్ల ధరలను 4% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాలు, ఆపరేషన్స్ ఖర్చులు పెరగడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అలాగే మోడల్‌ను బట్టి ధరల పెంపులో మార్పులు ఉంటాయని కూడా కంపెనీ తెలిపింది.
జనవరి 1 నుండి కూడా వాహన ధరలను పెంపుపై ప్రకటన
గతంలో ఈ ఏడాది జనవరి 1 నుండి కూడా వాహన ధరలను పెంపుపై ఓ ప్రకటన చేసింది, అప్పుడు కూడా ధరలను 4% పెంచింది. అంతే కాకుండా ఫిబ్రవరిలో చాల మోడళ్ల ధరలను రూ.1,500 నుండి రూ.32,500కి పెరిగాయి.
అధిక సుంకాలు : ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల ధరల పెరుగుదల, ముడి పదార్థాలపై అధిక సుంకాలు కూడా ఆటోమొబైల్ కంపెనీలను ప్రభావితం చేస్తున్నాయి. దింతో భారతీయ కార్ల తయారీదారులు పెరిగిన ఖర్చులను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు సప్లయ్ చైన్ అంతరాయాలు ఈ సవాళ్లను మరింత తీవ్రతరం చేశాయి.