ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో జగన్ పై మందకృష్ణ ఫైర్

Manda krishna: ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో జగన్ పై మందకృష్ణ ఫైర్

cఏపీలో ఎస్సీ వర్గీకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడంతో పాటు దీనిపై నియమించిన ఏక సభ్య కమిషన్ రిపోర్టును కూడా ఆమోదించింది. దీనిపై మాల కులాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కూటమిలో భాగస్వాములైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు భిన్నంగా విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మౌనంగా ఉంటున్నారు. దీనిపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు.

Advertisements

శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని
ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేయడంలో సీఎం చంద్రబాబుదే కీలకపాత్ర అన్నారు. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆయన తెలిపారు. 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి ఈ విజయం అంకితమని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు న్యాయంవైపే నిలబడ్డారని ప్రశంసించారు. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.

తమకు అండగా మోదీ, అమిత్‌షా, వెంకయ్య, కిషన్‌రెడ్డి
1997లో చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకుని తాను ఎస్సీ వర్గీకరణ కోసం పాదయాత్ర ప్రారంభించానని మందకృష్ణ గుర్తుచేసుకున్నారు. మోదీ, అమిత్‌షా, వెంకయ్య, కిషన్‌రెడ్డి తమకు అండగా నిలిచారన్నారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తుచేస్తూ పవన్ కల్యాణ్ కూడా మద్దతిచ్చారన్నారు. అదే సమయంలో జగన్ ఉంటే ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్లం కాదని మందకృష్ణ తెలిపారు. కనీసం వినతిపత్రం ఇచ్చేందుకూ జగన్ తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాన్ని వైసీపీ ఇంకా చెప్పలేదన్నారు.

Related Posts
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం
రేణిగుంట విమానాశ్రయం

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం శనివారం ఉదయం 11.52 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి Read more

ఏపీలో త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు
Free health insurance scheme to be implemented in AP soon

దాదాపు అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య సేవలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక పథకం అమలు చేసేందుకు సిద్ధపడింది. ఆరోగ్య శ్రీతో సంబంధం Read more

Recording Dances : పిఠాపురం నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు
Recording Dances : పిఠాపురం నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం, మూలపేటలో జరిగిన రికార్డింగ్ డాన్సులు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. అమ్మవారి జాతర సందర్భంగా అర్ధరాత్రి సమయంలో యువతులతో Read more

Bhumana Karunakar : తిరుపతిలో హైటెన్షన్..భూమన హౌస్ అరెస్ట్ !
High tension in Tirupati.. Bhumana under house arrest!

Bhumana Karunakar : తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పర సవాళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×