థాయ్‌లాండ్‌కి చెందిన 44 ఏళ్ల థవీసక్ (Thavisak) జీవితంలో ఆ ఒక్క క్షణమే అన్నింటినీ మార్చేసింది. భార్య విడాకులు (Wife divorce) ఇవ్వడంతో అతని మనసు తల్లడిల్లిపోయింది. పదహారేళ్ల కుమారుడిని తన వద్ద ఉంచి భార్య వెళ్లిపోవడంతో ఒంటరితనం అతన్ని చుట్టుముట్టింది. భార్య నుండి దూరమయ్యాక, థవీసక్ ఆహారాన్ని పూర్తిగా మానేశాడు. తినకుండా ఉండి, రోజంతా బీర్లు తాగడమే అతని దినచర్యగా మారిపోయింది.విచారణ ప్రకారం, విడాకుల తర్వాత ఒక్కసారి కూడా థవీసక్ భోజనం చేయలేదట. ప్రతిరోజూ పలుసార్లు బీరు తాగడమే అతని జీవితం. ఈ అలవాటుతో అతని శరీర ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. మద్యం కారణంగా అవయవాలు పని చేయకపోవడం మొదలైంది. మానసిక వేదనతో పాటు శారీరక అసహనంతో అతను బలహీనుడిగా మారిపోయాడు.

స్వచ్ఛంద సంస్థ సహాయం చేసేందుకు వెళ్లేసరికి విషాదం
థవీసక్ పరిస్థితి గమనించిన ఒక స్వచ్ఛంద సంస్థ అతనికి వైద్యం అందించేందుకు ఆసుపత్రికి తరలించాలనే ప్రయత్నం చేసింది. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. వారు అతని ఇంటికి చేరేసరికి అతను ప్రాణాలు కోల్పోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు అతని గదిలో దాదాపు 100 బీరు సీసాలను కనుగొన్నారు. రోజుకు గరిష్టంగా నాలుగు నుండి ఐదు సీసాలు తాగినట్టు అంచనా వేస్తున్నారు.
మద్యం దుర్వినియోగం – విషాద ముగింపు
అధికంగా మద్యం సేవించడం వల్లే థవీసక్ మరణించాడని పోలీసులు భావిస్తున్నారు. విడాకుల బాధను తట్టుకోలేకపోయిన అతని బాధను ఎవరూ గుర్తించలేదు. ఒక వ్యక్తి మానసికంగా ఎంతగా భాదపడతాడో ఈ ఘటన చూపిస్తోంది. బలమైన మద్దతు లేకపోతే ఒంటరితనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో, ఈ సంఘటన అందుకు తార్కాణం.
మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం
ఈ ఘటన మనకు మనసు నొప్పిని పట్టించుకోవడం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు మానవ సంబంధాలు, మద్దతు ఎంత అవసరమో ఈ సంఘటన మళ్లీ నిరూపించింది.
Read Also : Rahul : మోదీలో దమ్ము లేదు – రాహుల్ గాంధీ