మలయాళ హీరోయిన్ ‘మమిత బైజు’ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. గత కొంతకాలంగా మలయాళం సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నస్లీన్, మమితా కలిసి నటించిన “ప్రేమలు” చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి మంచి హిట్ కొట్టింది. దీంతో చేసింది ఒక్క సినిమానే అయిన ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ భామ. అయితే ఈ హీరోయిన్ గురించి ఇప్పుడు ఓ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
భారీ బడ్జెట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరగగా గత నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించారు.రీసెంట్ గానే ఎన్టీఆర్ కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో ఈ సినిమా కూడా కేజీఎఫ్, సలార్ సినిమాల కంటే కూడా భారీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.ఈ సినిమాలోనే మమిత ఛాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మూవీలో ఓ కీలక పాత్ర కోసం మమితను తీసుకున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ప్రశాంత్ నీల్ – తారక్ ప్రాజెక్టులో మమిత నటించడం అంటే పెద్ద ఆఫర్ ఏ అని ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోయినప్పటికీ త్వరలోనే రావొచ్చు అని భావిస్తున్నారు. ప్రస్తుతం మమిత దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమాలో నటిస్తోంది. అలానే పలు సినిమాల్లో సైతం నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా కోసమే దాదాపు ఐదు నెలల్లోనే ఎన్టీఆర్ సుమారుగా 18 కేజీల బరువు తగ్గారని అంటున్నారు. రోజుకు మూడు గంటల పాటు వర్కౌట్ చేసి, ఫ్యాట్ ఎంకరేజ్ చేయకుండా హై ప్రోటీన్స్ తో ఎన్టీఆర్ డైట్ ను పాటించారని చెబుతున్నారు. దీంతో ఎన్టీఆర్ బాగా బరువు తగ్గి పోయారని తెలిపారు.

హైప్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకుంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చిన ప్రశాంత్ నీల్ తో పాటు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో కలిసి పనిచేయడం సినిమాకు హైప్‌ను మరింత పెంచింది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో మమితకు అవకాశం రావడం అంటే నిజంగా గొప్ప విషయమే. ఇది మమిత కెరీర్‌కు మైలురాయిగా మారే అవకాశం ఉందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.ఈ ప్రచారం నిజం అయితే, మమిత కెరీర్‌లో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని నిశ్చయంగా చెప్పొచ్చు. అభిమానులు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో మమితకు విషెస్ వస్తున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉన్నా, ఇప్పటి వరకు వచ్చిన సంకేతాల ప్రకారం మమిత భవిష్యత్తు చాలా బ్రైట్‌గా కనిపిస్తోంది.
Read Also: Emran Hashmi : అడాల్‌సెన్స్ వెబ్‌సిరీస్‌పై ఇమ్రాన్ హష్మీ సంచలన కామెంట్స్