చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘన చోటు చేసుకుంది. మేజర్ ఫ్లాట్ ఫాం(Major Platforms)ల నుంచి దాదాపు 16 బిలియన్ ఖాతాలు హ్యాక్ చేశారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద డేటా ఉల్లంఘన ఇదేనని నిపుణులు చెబుతున్నారు. గూగుల్, ఆపిల్, టెలిగ్రామ్, జిమెయిల్(Google, Apple, Telegram) ఇతర ప్రధాన సేవలతో సహా ప్రపంచవ్యాప్తంగా 16 బిలియన్ల (1,600 కోట్ల) వినియోగదారుల పాస్‌వర్డ్(Password)లు దొంగిలించారని ఫోర్బ్స్, సైబర్ న్యూస్ వార్తా సంస్థ(Cyber News Vaartha Angecy)లు నివేదికలు విడుదల చేశాయి. ఈ దొంగిలించిన పాస్‌వర్డ్‌లను ఇంటర్నెట్‌లో డార్క్ వెబ్‌లో విక్రయిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ద్వారా, హ్యాకర్లు ఈ సమాచారాన్ని ఉపయోగించి ఇమెయిల్, గూగుల్ ఖాతాలు, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా నుండి ప్రభుత్వ వెబ్‌సైట్‌ల వరకు వివిధ ఆన్‌లైన్ సేవలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది.

ప్రపంచంలోని 16 బిలియన్ ఖాతాల యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు, ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారం దొంగిలించారు. ఈ దొంగతనంలో ఇండియన్ల సమాచారం ఎంత దొంగిలించారో కనుక్కోవాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In)ని కోరింది. CERT-In సమాచారాన్ని సేకరించి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
టెక్స్ట్ మెసేజ్ లేదా ఇమెయిల్ క్లిక్ చేయవద్దు
హ్యాకర్లు తరచుగా ఒక నిర్దిష్ట వెబ్‌సైట్‌కు సంబంధించిన నకిలీ లింక్‌ను క్రియేట్ చేసి ఓ వ్యక్తి మొబైల్ నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్ లేదా ఇమెయిల్ ద్వారా పంపుతారు.యూజర్ వెంటనే దానిపై క్లిక్ చేయగానే ఆటోమేటిగ్గా కొన్ని వివరాలు డిస్ ప్లే అవుతాయి. యూజర్లు ఆ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, హ్యాకర్లు వాటిని హ్యాక్ చేసి డార్క్ వెబ్ సైట్‌లలో చట్టవిరుద్ధంగా అమ్మకానికి పెడతారు.ఆ వివరాలతో కొందరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడతారు. ఈ ప్రాసెస్ లో సామాన్యులే తమకు తెలియకుండానే ఎక్కువగా బలి పశువులు అవుతున్నారు.
మీ మొబైల్‌లో OTP వచ్చేలా సెట్ చేసుకోండి
కాబట్టి ఎవరూ కూడా అవాంఛిత ఈమెయిల్స, లింక్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయవద్దని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి వాటిపై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత డేటా మొత్తం హ్యాక్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మీరు ఇలాంటి వాటి భారీన పడి ఉండే వెంటనే మీ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చండి. మీ ఖాతాలకు మల్టీ-ఫాక్టర్ అథెంటికేషన్ (MFA) / టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) ఉపయోగించండి. మీ మొబైల్‌లో OTP వచ్చేలా సెట్ చేసుకోండి. దీంతో పాటు అన్ని ఖాతాలకు ఒకే పాస్ వర్డ్ ఉపయోగించవద్దు.
Read Also: Gaurav Chintamanidi: అమెరికాలో ఉద్యోగం పూలపాన్పు కాదు..ఓ భారతీయుడి ఆవేదన