టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చట్టపరంగా ఓ వివాదంలో చిక్కుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేష్ బాబు (Mahesh Babu) కు వినియోగదారుల కమిషన్ తాజా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.వారి వద్ద ప్లాట్ కొని మోసపోయిన ఓ డాక్టర్, ఇంకో వ్యక్తి ఈ మేరకు కన్‌జ్యూమర్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ డెవలపర్స్ యజమానులు, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేష్ బాబు ఫిర్యాదు చేయగా, వినియోగదారుల కమిషన్ ఇలా నోటీసులు అందించినట్టుగా సమాచారం.
సంగతి తెలిసిందే
మహేష్ బాబుకి గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చిన సమాచారం. ఇక ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన టైంలో తీసుకున్న రెమ్యూనరేషన్ (Remuneration) మీద ఈడీ నజర్ పడింది. సగం మనీ బ్లాక్‌లో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై విచారించేందుకు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలా వినియోగదారుల ఫోరం నుంచి కూడా మహేష్ బాబుకి నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది.ఈ నోటీసుల్లో మొదటి ప్రతివాదిగా సంస్థను, యజమాని సతీష్ పేరుని రెండో ప్రతివాదిగా, మహేష్ బాబుని మూడో ప్రతివాదిగా చేర్చారు.

బ్రాండ్ అంబాసిడర్
ఓ డాక్టర్, మరో వ్యక్తి అందులో 33 లక్షలకు పైగా డబ్బులు పెట్టి ప్లాట్ తీసుకున్నారట. అన్ని రకాల అనుమతులున్నాయని చెప్పి, మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన బ్రోచర్‌ను కూడా ఇచ్చారట. కానీ అక్కడ ఎలాంటి ప్లాట్ (Plat) లేదని, డబ్బులు తిరిగి ఇవ్వమంటే అతి కష్టంగా 15 లక్షలు మాత్రమే వెనక్కి వచ్చాయట.దీంతో వారు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారట. మరి ఈ నోటీసులకు మహేష్ బాబు రియాక్ట్ అవుతారా? లేదా? అన్నది చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Renu Desai: రెండో పెళ్లికి తాను సిద్ధంగానే ఉన్నానన్న రేణు దేశాయ్