akhilesh yadav

మహాకుంభ్ మృతుల లెక్కలు దాచిపెడుతున్నారు: అఖిలేష్ యాదవ్

మహాకుంభ్ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల లెక్కలను దాచిపెడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి అసలైన లెక్కను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి బడ్జెట్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు లోక్‌సభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో అఖిలేష్ మాట్లాడుతూ, మహాకుంభ్ ఏర్పాట్లపై మాట్లాడానికి బదులుగా ఆ ఆవెంట్‌ను ప్రచారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజీగా ఉందన్నారు. 100 కోట్ల మంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అమృత్‌స్నాన్ సకాలంలో నిర్వహించడంలో విఫలమైందని, తొలిసారి అమృత్ స్నాన్ సంప్రదాయం దెబ్బతిందని అన్నారు.

Advertisements

మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అసలు లెక్కల్ని ప్రభుత్వం తొక్కిపెట్టిందని అఖిలేష్ అన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు జేసీబీలను ప్రభుత్వం ఉపయోగించిందని ఆరోపించారు. మహాకుంభ్‌ యాత్రకు వచ్చిన కుటుంబాలకు తమ ప్రియతములను కోల్పోయి మృతదేహాలతో వెనక్కి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపిన తర్వాత 17 గంటలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారని, ఘటన జరిగినట్టు అంగీకరించారని అన్నారు.

Related Posts
Waqf Bill : వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Lok Sabha passes Waqf Amendment Bill

Waqf Bill: సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ‌ చర్చ జరిగింది. 12 గంటల Read more

ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ
ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ

భారత దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు మరే దేశంలోని Read more

ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేసిన అధికారులు
Officials who besieged the Delhi Secretariat

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల ఫలితాలు రాగానే కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ నుంచి ఒక్క ఫైల్ కూడాబయటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఈ మేరకు Read more

డీప్‌సీక్ యాప్ డౌన్‌లోడ్ చేస్తే జైలు శిక్ష
deepseek

కృత్రిమ మేధస్సులో చైనా ప్రభావాన్ని అరికట్టడానికి అమెరికా సెనేటర్ జోష్ హాలే ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఆమోదం పొందితే డీప్‌సీక్ వంటి చైనా అభివృద్ధి Read more

×