అమెరికాలో భారత సంతతికి చెందిన ఆనంద్ షా ఆరోపణల్లో చిక్కుకున్నారు. గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నడిపిస్తున్నట్లు అతనిపై అభియోగాలు నమోదు అయ్యాయి. న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ఆ ఆరోపణలు చేశారు. మాఫియా తరహా గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఆనంద్ షా రాకెటీరింగ్, గ్యాంబ్లింగ్, మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నాడని తేలింది. అభియోగాలు నమోదు అయిన 39 మందిలో అతను ఉన్నట్లు అటార్నీ జనరల్ తెలిపారు. రాష్ట్రంలోని 12 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించిన తర్వాత ఈ అభియోగాలు నమోదు చేశారు. మొత్తం 4 పోకర్ క్లబ్‌లపై దాడులు జరిగాయి.39 మంది గ్యాంగ్ స్పోర్ట్స్‌బుక్ గ్యాంబ్లింగ్ పేరుతో స్పోర్ట్స్ టోర్నీలపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
మున్సిపల్ కౌన్సిలర్
న్యూజెర్సీలో ఆనంద్ షా ఓ కీలక రాజకీయనేతగా ఎదుగుతున్నారు. న్యూయార్క్ శివారు ప్రాంతం ప్రాస్పెక్ట్ పార్క్‌లో అతను మున్సిపల్ కౌన్సిలర్‌గా ఇటీవల రెండోసారి ఎన్నికయ్యారు. ఎకనామిక్ డెవలప్మెంట్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. కౌన్సిల్ సభ్యుడిని అరెస్టు చేయడం అంటే ప్రజల్లో ఎన్నికైన వ్యక్తులపై విశ్వాసాన్ని కోల్పోవడమే అవుతుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ పేర్కొన్నారు.

మరో భారత సంతతి వ్యక్తి
ఫ్లోరిడాకు చెందిన మరో భారత సంతతి వ్యక్తి సమిర్ ఎస్ నందకర్ని పై కూడా అభియోగాలు నమోదు అయ్యాయి. పోకర్ హోస్ట్ అని అతనిపై కేసు బుక్ చేశారు.స్పోర్ట్స్‌బుక్ గ్యాంబ్లింగ్ పేరుతో స్పోర్ట్స్ టోర్నీలపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సుమారు మూడు మిలియన్ల డాలర్ల గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తేలింది. సినిమాలు, టీవీల్లో మాఫియాను రొమాంటిక్‌గా చూపిస్తారని, కానీ వాస్తవంలో అది చట్టాలను బ్రేక్ చేయడమే అవుతుందని, డబ్బు కంట్రోల్, హింసకు దారి తీస్తుందని అటార్నీ తెలిపారు.గ్యాంబ్లింగ్ అనేది సాధారణంగా లాటరీలు, జూదాలు, స్పోర్ట్స్ బెట్టింగ్‌లు, క్యాసినోలు, ఆన్‌లైన్ గేమ్స్ రూపంలో జరుగుతుంది. ప్రత్యేకంగా స్పోర్ట్స్‌బుక్ గ్యాంబ్లింగ్ అంటే క్రీడా పోటీలపై డబ్బుతో పందేలు వేయడం. కొన్ని దేశాల్లో ఇది చట్టపరంగా అనుమతించినా, చాలా చోట్ల ఇది నిషిద్ధం. గ్యాంబ్లింగ్ వల్ల వ్యక్తిగత ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలు, ఇంకా సామాజిక స్థిరత్వానికి భంగం కలగవచ్చు. కొన్ని మాఫియా గుంపులు గ్యాంబ్లింగ్ వ్యాపారాన్ని అక్రమ ఆదాయ మూలంగా వాడుతున్నట్లు అధికారుల నివేదికల ద్వారా బయటపడుతోంది.
గ్యాంబ్లింగ్ మొదట్లో సరదా కోసం ప్రారంభమైనా, కొంతమంది దాన్ని ఆదాయం సాధించే మార్గంగా భావించి, పదే పదే డబ్బు పెట్టడం మొదలుపెడతారు. అయితే ఇందులో గెలుపు అనేది చాలా అరుదు. ఎక్కువసార్లు ఆడే కొద్దీ నష్టాలు పెరిగిపోతూ ఆర్థికంగా పూర్తిగా నష్టపోతారు. ఇది ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఒత్తిడికి, కుటుంబ సంబంధాల విరోధానికి, చివరికి ఆత్మహత్యలకు కూడా దారి తీసే ప్రమాదకరమైన వ్యసనంగా మారుతోంది.
Read Also: America:అమెరికాలో విద్యను అభ్యసించాలనుకుంటున్న భారతీయ విద్యార్థులలో అనిశ్చితి