Mad Square Movie Review: మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ..

Mad Square Movie Review: మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ..

బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

కథ

ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న మనోజ్ (నార్నే నితిన్), అశోక్ (రామ్ నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్)ముగ్గురు కాలేజీ నుంచి బయటకు వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత లడ్డు అలియాస్ గణేష్ (విష్ణు) పెళ్లిలో కలుస్తారు.అతను తమను పెళ్లికి పిలవకపోయినా, ముగ్గురు స్నేహితులు పెళ్లికి వెళ్లటంతో ఊహించని పరిణామాలు మొదలవుతాయి.అనుకోకుండా లడ్డూ పెళ్లి రద్దవుతుంది. అయితే పెళ్లి ఆగిపోయినా, అతను హనీమూన్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతనితో కలిసి మనోజ్, అశోక్, దామోదర్ కూడా గోవా వెళతారు. అక్కడ, ఓ మ్యూజియంలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. ఇదే కాదు, లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్) భాయ్ (సునీల్) చేతిలో కిడ్నాప్ అవుతాడు. ఈ లోగా, గోవాలో లైలా (ప్రియాంక జువాల్కర్) అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె కోసం అందరూ వెతకడం మొదలు పెడతారు. చివరకు గోల్డ్ చైన్ దొంగతనం కేసు నిజంగా ఎవరు చేశారు? లడ్డూ తండ్రిని ఎలా విడిపించారు? అన్న ప్రశ్నలకు సమాధానం ఈ కథలో దొరుకుతుంది.

విశ్లేషణ

ఈ సినిమా మేకర్స్‌ ముందు నుంచి చెబుతున్నట్లుగా ఈ చిత్ర కథలో ఎటువంటి లాజిక్‌లు లేవు. వినోదమే ప్రధానంగా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. లడ్డూ పెళ్లి ఏపిసోడ్స్‌కు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ అందర్ని అలరించే విధంగా ఉంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా, సాగతీతగా అనిపించినా, తదుపరి సన్నివేశంలో వచ్చే హిలేరియస్‌ ఫన్‌ కవర్‌ చేసింది. ముఖ్యంగా యూత్‌ను  టార్గెట్‌గా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. 

Capture

ఫస్ట్‌హాప్‌

సినిమాలో ఫస్ట్‌హాప్‌ అంతా లడ్డూ పెళ్లి  చుట్టే తిరుగుతుంది. పెళ్లి కోసం డిజైన్‌ చేసిన కామెడీ బాగా పండింది. ముఖ్యంగా లడ్డూ పెళ్లిలో, పెళ్లి కూతురు పారిపోయే ఏపిసోడ్‌, అక్కడ హీరోలు, నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌లు చేసే హడావుడి బాగా వర్కవుట్‌ అయ్యింది. కమెడియన్స్‌ సునీల్‌, సత్యం రాజేష్‌ల పాత్రలను దర్శకుడు ఎంతో ఫన్‌గా, వైవిధ్యంగా డిజైన్‌ చేశాడు. ఆ పాత్రలు చేసే కన్‌ఫ్యూజన్‌ కామెడీ కూడా ప్రేక్షకులను కావాల్సినంత వినోదాన్ని అందించింది. 

సెకండాఫ్‌

‘మ్యాడ్‌’లో ఉన్న కాలేజీ వాతావరణం, అక్కడ హడావుడి ఈ పార్ట్‌లో లేకపోవడం, కాలేజ్‌ ఫన్‌లో ఉన్న కిక్‌, ‘మ్యాడ్‌ స్క్వేర్‌లో లేకపోవడం కాస్త మైనస్‌గానే  అనిపించింది. అంతేకాదు ముఖ్య పాత్రలకు జంటగా  హీరోయిన్స్‌ లేకపోవడం కూడా వెలితిగానే అనిపించింది. ఫస్ట్‌హాఫ్‌ సరదా సరదాగా హిలేరియస్‌ ఫన్‌తో కొనసాగితే, సెకండాఫ్‌లో ఫస్ట్‌హాఫ్‌కు మించిన వినోదం ఉంది. భీమ్స్‌ పాటలు థియేటర్‌లో ప్రేక్షకుల్లో హుషారు తెప్పించాయి. లడ్డూ గాని పెళ్లి పాటతో పాటు స్వాతి రెడ్డి పాటలు మంచి జోష్‌ను నింపాయి. ఈ సినిమా నిడివి కూడా కేవలం 2 గంటల 7 నిమిషాలతో ఉండటంతో సన్నివేశాలు బాగున్నాయి.దాంతో ఆడియన్స్‌ కూడా ఎక్కడా కూడా నిరాశ చెందే అవకాశం ఉండదు. 

సాంకేతిక విభాగం,నటీనటులు

మేకర్స్ పెట్టిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించి అందించారు. ఇక టెక్నీకల్ టీం లో భీమ్స్ మ్యూజిక్ బాగుంది. ఆయన మార్క్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక షామ్ దత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు కళ్యాణ్ శంకర్ విషయానికి వస్తే.. తాను కొత్త కథ, కథాంశాలు ఏమి ఎంచుకోలేదు కానీ యూత్ కి కావాల్సిన ఓ ఎంటర్టైనర్ ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.నార్నే నితిన్‌, రామ్‌నితిన్‌, సంగీత్‌ శోభన్‌, విష్ణులు  మరోసారి ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ చేసే పాత్రల్లో ఎంతో హుషారుగా, ఎనర్జీతో కనిపించారు. వాళ్లే ఎనర్జీయే సినిమాకు ప్లస్‌ పాయింట్‌. దర్శకుడు రాసిన సన్నివేశాలకు వీళ్ల నటన తోడవ్వడంతో ఆ సీన్స్‌ మరింత హిలేరియస్‌గా ఎంటర్‌టైన్‌ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అందరి నటనలోనూ మరింత ఎనర్జీ, మెచ్యూరీటి, డైలాగ్‌ డెలివరి, డిక్షన్‌లో బెటర్‌మెంట్ కనిపించింది. భాయ్‌ పాత్రలో సునీల్‌ మెప్పించాడు. ‘పుష్ప’ తరువాత సునీల్‌కు లభించిన మరో వైవిధ్యమైన పాత్ర ఇది. 

Related Posts
OTT: సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ సినిమా
horro movie

ఓటీటీ ప్రపంచంలో హారర్, సస్పెన్స్ సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పొలిమేర 2, తంత్ర, పిండం వంటి చిత్రాలు ఆడియెన్స్‌ను మంచి టెన్షన్‌తో భయపెట్టాయి. Read more

పవన్ అజిత్ దారులు వేరైనా గమ్యం ఒకటే?
పవన్ అజిత్ దారులు వేరైనా గమ్యం ఒకటే

సినిమాల విషయంలో మామూలుగా పవన్ కల్యాణ్‌ను తమిళనాడులో విజయ్‌తో పోలుస్తారు. కానీ, చరిష్మా పరంగా పవన్ కల్యాణ్ మరియు అజిత్ మధ్య ఎప్పటికప్పుడు పోలికలు ఉంటాయి. ఈ Read more

ఓటిటి లోకి రానున్న పోతగడ్డ సినిమా
ఓటిటి లోకి రానున్న పోతగడ్డ సినిమా

సంక్రాంతి తరువాత సినిమాల జోరు క్రమంగా తగ్గుతోంది.కొత్త చిత్రాలు విడుదలయ్యే కొద్దీ,గతంలో వచ్చిన సినిమాల కలెక్షన్లు తగ్గిపోతున్నాయి.ఈ శుక్రవారం (జనవరి 31) కూడా కొత్త సినిమాలతో థియేటర్లు Read more

రష్మికకు భద్రత కోరుతూ : అమిత్ షాకు కొడవ కౌన్సిల్ లేఖ
రష్మికకు భద్రత కోరుతూ అమిత్ షాకు కొడవ కౌన్సిల్ లేఖ

రష్మికకు భద్రత కోరుతూ : అమిత్ షాకు కొడవ కౌన్సిల్ లేఖ ఇప్పుడు ఎక్కడ చూసినా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు మార్మోగిపోతోంది. వరుస విజయాలతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *