ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025లో భాగంగా,ఈడెన్ గార్డెన్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్ ) ,లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ) జట్లు పరస్పరంగా పోటీపడ్డాయి. ఉత్కంఠభరితంగా జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డా లక్నోనే గెలుపు వరించింది. లక్నో నిర్దేశించిన 239 పరుగుల ఛేదనలో కేకేఆర్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్సర్లు), మార్ష్ (48 బంతుల్లో 81, 6 ఫోర్లు, 5 సిక్సర్లు), మార్క్మ్ (28 బంతుల్లో 47, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238 పరుగుల రికార్డు స్కోరు చేసింది. భారీ ఛేదనలో కేకేఆర్ 20 ఓవర్లలో 234/7 వద్దే ఆగిపోయింది. కెప్టెన్ అజింక్యా రహానే (35 బంతుల్లో 61, 8 ఫోర్లు, 2 సిక్సర్లు),వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45, 6 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు ఆఖర్లో రింకూ సింగ్ (15 బంతుల్లో 38 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు.
90 పరుగులు
డికాక్ (15), నరైన్ (13 బంతుల్లో 30, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 2.3 ఓవర్లలోనే 37 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్నిచ్చారు. డికాక్‌ను ఆకాశ్ దీప్ మూడో ఓవర్లో వికెట్ల ముందు బలిగొన్నాడు. కానీ రహానే, నరైన్ లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు ఒక వికెట్ నష్టానికి 90 పరుగులు చేసి లక్ష్యం వైపు దూసుకెళ్లింది. దిగ్వేశ్ 7వ ఓవర్లో రెండో బంతికే నరైన్‌ను ఔట్ చేసి లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. వెంకటేశ్‌తో కలిసి రహానే లక్ష్యాన్ని కరిగించాడు. ఈ ఇద్దరూ ఓవర్‌కు పదికి తగ్గకుండా పరుగులు రాబట్టారు.

38 పరుగులు
వరుస ఓవర్లలో రమణ్‌దీప్ (1), రఘువంశీ (5)తో పాటు క్రీజులో పాతుకుపోయిన వెంకటేశ్ వికెట్లను కోల్పోయింది. రసెల్ (7) సైతం నిరాశపరిచాడు. 4 ఓవర్లలో 23 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 5 కీలక వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 38 పరుగులు అవసరమనగా ఆఖర్లో రింకూ6, 4, 4, 4, 6తో మెరుపులు మెరిపించినా ఆ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.11వ ఓవర్లో రాణా రెండో బంతికి మార్క్మ్ క్లీన్‌బౌల్డ్ చేసి 99 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు.మార్క్మ్ ఔట్ అయినా మార్ష్‌కు పూరన్ జతకలవడంతో అగ్నికి ఆజ్యం తోడైనైట్టెంది. హర్షిత్ ఓవర్లోనే ఆఖరి బంతిని బౌండరీకి తరలించి ఈ సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీని నమోదుచేసిన మార్ష్ ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు. మరో ఎండ్‌లో పూరన్ బాదడంతో లక్నో స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. నరైన్ 15వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన అతడు రసెల్, రాణా బౌలింగ్‌లోనూ బంతిని స్టాండ్స్‌లోకి పంపించి 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. రసెల్ 18వ ఓవర్లో పూరన్ 4, 4, 6, 4, 6తో 24 పరుగులతో లక్నో భారీ స్కోరు సాధించింది.
Read Also: IPL2025: చెన్నైని ఓడించిన పంజాబ్