IPL 2025:గుజరాత్‌ టైటాన్స్‌పై లక్నో ఘన విజయం

IPL 2025:గుజరాత్‌ టైటాన్స్‌పై లక్నో ఘన విజయం

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌(ఎల్‌ఎస్‌జీ) అదరగొడుతున్నది.లీగ్‌ మొదట్లో తడబడ్డ లక్నోతరువాత అద్భుతంగా పుంజుకుంది. శనివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో లక్నో 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది.తొలుత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(38 బంతుల్లో 60, 6ఫోర్లు, సిక్స్‌), సాయి సుదర్శన్‌(37 బంతులోల 56, 7ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీలతో గుజరాత్‌ 20 ఓవర్లలో 180/6 స్కోరు చేసింది. బట్లర్‌(12), షారుఖ్‌ఖాన్‌(11) నిరాశపరిచారు. శార్దుల్‌ ఠాకూర్‌(2/34), రవి బిష్ణోయ్‌(2/36) రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 186/4 స్కోరు చేసింది. నికోలస్‌ పూరన్‌(34 బంతుల్లో 61, ఫోర్‌, 7సిక్స్‌లు), మార్క్మ్‌(్ర31 బంతుల్లో 58, 9ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీలతో లక్నో విజయంలో కీలకమయ్యారు. ప్రసిద్ధ్‌ కృష్ణ(2/26)కు రెండు వికెట్లు దక్కాయి.

Advertisements

కెప్టెన్‌ పంత్‌

ఈ సీజన్‌లో సూపర్‌ఫామ్‌మీదున్న సుదర్శన్‌ లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. మరో ఎండ్‌లో గిల్‌ కూడా దూకుడు కనబర్చడంతో గుజరాత్‌కు పరుగుల రాక సులువైంది. ఓవర్‌కు కచ్చితంగా ఒకటికి తగ్గకుండా బౌండరీ బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి టైటాన్స్‌ వికెట్‌ కోల్పోకుండా 54 పరుగులు చేసింది. ఈ జోడీని విడదీసేందుకు లక్నో కెప్టెన్‌ పంత్‌ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో 31 బంతుల్లో గిల్‌ అర్ధసెంచరీ మార్క్‌ అందుకోగా, సుదర్శన్‌ చక్కని సహకారం అందించాడు. దిగ్వేశ్‌ ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో ఫోర్‌తో సుదర్శన్‌ ఈ సీజన్‌లో నాలుగో అర్ధసెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరి జోరు చూస్తుంటే భారీ స్కోరు ఖాయమనుకుంటున్న తరుణంలో అవేశ్‌ఖాన్‌ 13వ ఓవర్‌లో గిల్‌ను ఔట్‌ చేయడం ద్వారా 120 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. గిల్‌ తర్వాత టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ అదే దూకుడు కొనసాగించలేకపోయింది. రెండు పరుగుల తేడాతో సుదర్శన్‌ కూడా ఔట్‌ కావడంతో 122 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్న సుందర్‌(2) త్వరగానే పెవిలియన్‌ చేరగా, బట్లర్‌(16) బ్యాటు ఝులిపించలేకపోయాడు. ఆఖర్లో రూథర్‌ఫర్డ్‌(22), షారుఖ్‌ఖాన్‌(11 నాటౌట్‌) బౌండరీలతో గుజరాత్‌ మెరుగైన స్కోరు అందుకుంది.

 IPL 2025:గుజరాత్‌ టైటాన్స్‌పై లక్నో ఘన విజయం

భారీ సిక్స్‌

ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్‌ పంత్‌మార్క్మ్‌త్రో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. సిరాజ్‌ తొలి ఓవర్‌ ఆఖరి బంతికి ఫోర్‌తో మొదలుపెట్టిన మార్క్మ్‌ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ మార్క్మ్‌ రెండు ఫోర్లతో చెలరేగితే పంత్‌ మరో ఫోర్‌ అరుసుకున్నాడు. ఇంప్యాక్ట్‌ సబ్‌గా వచ్చిన ప్రసిద్ధ్‌ కృష్ణ వరుసగా రెండు బంతుల్లో ఔటయ్యే ప్రమాదం నుంచి మార్క్మ్‌ బయటపడ్డాడు. మరోవైపు పంత్‌ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో చెలరేగడంతో లక్నో 6 ఓవర్లు ముగిసే సరికి 61 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని పంత్‌ను ప్రసిద్ధ్‌ ఔట్‌ చేయడం ద్వారా విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన పూరన్‌ మార్క్మ్‌క్రు జత కలువడం ఇన్నింగ్స్‌ గతిని మార్చింది. ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్న పూరన్‌7 పరుగుల వద్ద రషీద్‌ క్యాచ్‌ విడిచిపెట్టడంతో బతికిపోయాడు. సాయికిషోర్‌ 10వ ఓవర్‌లో పూరన్‌ మూడు భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. అర్ధసెంచరీ తర్వాత మార్క్మ్‌ ఔటైనా పూరన్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. 23 బంతుల్లోనే అర్ధసెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. అయితే రషీద్‌ 16వ ఓవర్‌లో ధాటిగా ఆడే ప్రయత్నంలో పూరన్‌ క్యాచ్‌ ఔట్‌గా నిష్క్రమించాడు. బదోనీ(28 నాటౌట్‌), సమద్‌(2 నాటౌట్‌) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.

Read Also: IPL 2025:పంజాబ్‌పై ఎస్ ఆర్ హెచ్ ఘనవిజయం

Related Posts
TTD: రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు
రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

TTD: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6-11 గంటల Read more

Gold Price : పసిడి ధర లక్ష దాటింది
Gold Price : పసిడి ధర లక్ష దాటింది

Gold : పసిడి ధరలు లక్ష రూపాయల మార్కు దాటిన సంచలనానికి కారణం ఏమిటి? న్యూఢిల్లీ: దేశీయ బులియన్ మార్కెట్లు ఈ మధ్యకాలంలో అసాధారణంగా కళకళలాడుతున్నాయి. చరిత్రలో Read more

Waqf Bill : వక్స్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర – ఒవైసీ
వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల నియామకం వద్దు:సుప్రీంకోర్టు

వక్ఫ్ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్పై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైదరాబాద్‌ దారుస్సలాంలో ఆల్ ఇండియా ముస్లిం Read more

Russia: ఇండియన్ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి!
Russia: ఇండియన్ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి!

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్‌లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×