ఐపీఎల్ 2025 సీజన్‌లో 30వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (49 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ సీజన్‌తో తొలి అర్ధ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో జడేజా (2/24), పతిరాన (2/45) తలా రెండు వికెట్లు తీశారు. వికెట్లు పడకపోయినా నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి లక్నోను కట్టడి చేశాడు.స్పిన్నర్లకు సహకరించే ఏకనా పిచ్‌పై లక్నో ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. టాపార్డర్ వైఫల్యంతో ఆ జట్టు ఈ సీజన్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. బంతి దొరికితే స్టాండ్స్‌లోకి పంపిస్తూ పవర్ ప్లేలో వీరవిహారం చేసే బ్యాటింగ్ ద్వయం మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ (9 బంతుల్లో 8) సైతం చెన్నై బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. మొదటి ఓవర్‌లోనే ఖలీల్ (1/38).. మార్క్మ్‌న్రు ఔట్ చేసి చెన్నైకి తొలి బ్రేక్‌నిచ్చాడు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్‌ను అన్షుల్.. 4వ ఓవర్లో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి 6 ఓవర్లలో లక్నో స్కోరు 42/2 మాత్రమే. పూరన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ ఓవర్టన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో జట్టు స్కోరును 50 పరుగుల మార్కును దాటించాడు.
అహ్మద్ బౌలింగ్
ఓ బౌండరీ, రెండు సిక్సర్లతో ధాటిగా ఆడిన బదోని (22).. జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడేందుకు యత్నించగా ధోనీ స్టంపౌట్‌తో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్నర్ల రాకతో లక్నోకు పరుగుల రాక మందగించింది. ముఖ్యంగా నూర్ అహ్మద్ బౌలింగ్‌లో పంత్ తంటాలు పడ్డాడు. 39 బంతుల్లో 40 పరుగులు చేసిన పంత్ ఆ తర్వాత పతిరాన బౌలింగ్‌లో గేర్ మార్చి 2 సిక్సర్లు బాది ఈ సీజన్‌లో తొలి అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. ఆఖర్లో సమద్ (20) రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. పతిరాన వేసిన ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు పడటంతో లక్నో తక్కువ స్కోరుకే పరిమితమైంది.

మంచి ఫలితాలు
ఈ మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మ్యాచ్ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.ఒక జట్టుగా మేము 10 నుంచి 15 పరుగులు తక్కువ స్కోర్ చేశామని భావిస్తున్నాను. మా జట్టు మంచి దూకుడు మీద ఉన్నప్పుడు కూడా వికెట్లు కోల్పోతూనే ఉన్నాం. దీని కారణంగా మేము మంచి భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోయాం. పిచ్ లో ఎలాంటి లోపం లేదు. కానీ మా జట్టు ఎక్కువ పరుగులు చేసి ఉండాల్సింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంది. కొన్ని బంతులు అడపాదడపా వస్తున్నాయి. మేము ఇంకా 10 పరుగులు చేసి ఉండాలి. అప్పుడు మేము మ్యాచ్ పై పట్టు బిగించేవాళ్లం. ప్రతి మ్యాచ్ లో నేను మెరుగ్గా ఉన్నాను. కానీ కొన్ని సార్లు ప్రయత్నించిన తర్వాత కూడా మంచి ఫలితాలు రావడం లేదు. నేను నెమ్మదిగా నా ఫామ్ లోకి తిరిగి వచ్చి ప్రతి మ్యాచ్ పై దృష్టి సారిస్తున్నాను” అని,ఈ మ్యాచ్ లో బిష్ణోయ్ కి ఎక్కువ ఓవర్లు ఇవ్వలేకపోయాం. చివరి ఓవర్ బౌలింగ్ చేయలేకపోయాం. పవర్ ప్లేలో మా బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. కానీ మేము దానిని మెరుగుపరచుకోవచ్చు. మేము ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒక దానిని నేర్చుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్తులో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తాం.”అని రిషబ్ పంత్ అన్నాడు.
Read Also: IPL 2025: 11 బంతుల్లో 26 పరుగులు చేసిన ప్లేయర్ గా ఎంఎస్ ధోనీ రికార్డ్