భారతదేశం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఓ గొప్ప రికార్డును సృష్టించబోతోంది. అవును, ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పొడవైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) పైప్‌లైన్ నిర్మాణం మన దేశంలో పూర్తికావడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎంతో వైశాల్యం గలదిగా, దేశీయ ఇంధన వృద్ధికి పునాది వేసేలా మారుతోంది.

ప్రాజెక్టు విశేషాలు:
ఈ ప్రాజెక్ట్‌ను దేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) — సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ 50 శాతం వాటాను కలిగి ఉండగా, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ 25-25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.112 బిలియన్ల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ ఇంధన సరఫరాలో వందలాది ట్రక్కులను భర్తీ చేస్తుంది.
ఎలా ఉపయోగపడుతుంది?
ఈ పైప్‌లైన్ పూర్తిగా పని చేయడం ద్వారా ఎటువంటి వాహన రవాణా అవసరం లేకుండానే ఎల్పీజీను పెద్దపెద్ద నిల్వ కేంద్రాలకు పంపించడం సాధ్యమవుతుంది.
ఉత్తరప్రదేశ్‌కు గొప్ప వరం
ఈ గ్యాస్ పైప్‌లైన్ వల్ల ఉత్తరప్రదేశ్‌లోని 18 జిల్లాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. అనేక నగరాల్లోకి సులభంగా, వేగంగా గ్యాస్ సరఫరా జరగడం వల్ల, అక్కడి గృహ వినియోగదారులకు అలాగే పరిశ్రమలకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది. ఈ గ్యాస్ పైప్‌లైన్ పథకం వల్ల ఉత్తరప్రదేశ్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్ కూడా ప్రయోజనం పొందుతాయని సమాచారం.
ట్రక్కులు, ట్యాంకర్లు ద్వారా ఇంధన రవాణా చేయడంలో గాలి కాలుష్యం, డీజిల్ వినియోగం అధికంగా ఉండేది. కానీ పైప్‌లైన్ ద్వారా రవాణాతో పాటు పారిశ్రామిక ఉత్పత్తులలో శుద్ధత పెరుగుతుంది, అలాగే పర్యావరణానికి ముప్పు తక్కువగా ఉంటుంది.