వంశీ అరెస్టుపై లోకేశ్ స్పందన

వంశీ అరెస్టుపై లోకేశ్ స్పందన

ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో డీటీపీ ఆపరేషన్ సత్యవర్ధన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారని లోకేశ్ మండిపడ్డారు. ఇష్టమెుచ్చినట్లు వ్యవహరించి ప్రజలు, ప్రతిపక్ష నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ధ్వజమెత్తారు. విశాఖ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్ మీడియాతో మాట్లాడారు. 2019 -2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పాలన జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతలు, ప్రజా నాయకులు వెళితే వారిని ఇబ్బందులకు గురి చేసి వేధించారని ఆగ్రహించారు.

Advertisements

చంద్రబాబును తాళం వేయడంపై విమర్శలు:

ప్రభుత్వం గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని గృహ నిర్బంధం చేసిన తీరును లోకేశ్ తప్పుబట్టారు. ఇంటి గేట్లకు తాళాలు వేసి బయటకు రానీయలేదని, ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే కేసులు బనాయించారని ఆరోపించారు.

గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి:

లోకేశ్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో గన్నవరం, మంగళగిరి టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. గన్నవరం ఘటనలో, ఆ దాడికి సంబంధించిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.డీటీపీ ఆపరేషన్ సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ, అతని అనుచరులు ఒత్తిడి తీసుకువచ్చారని, చివరికి సత్యవర్ధన్ కిడ్నాప్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.

లోకేశ్ హెచ్చరిక:

ఈ ఘటనపై స్పందించిన మంత్రి లోకేశ్, వైసీపీ నేతల హయాంలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు అనేక వేధింపులకు గురయ్యారన్నారు.
ఇప్పుడు ఆ బాధితులకు న్యాయం జరుగుతుందని, బాధ్యులపై న్యాయపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

రెడ్ బుక్

ఆ రెడ్ బుక్‌లో వంచనలకు గురైన ప్రజల బాధలు, టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల వివరాలు లిపిబద్ధం చేశామని తెలిపారు.గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో జరిగిన ఈ ఘటనలు, ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రాగానే, న్యాయపరమైన చర్యల రూపంలో ప్రతిఫలిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో అధికార పార్టీ నేతలు అరెస్టులు, కేసులు, విచారణలు ఎదుర్కొంటున్నారు.
ఇక గన్నవరం ఘటనకు సంబంధించి మరిన్ని అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది.

Related Posts
ఏపీ సర్కార్ తో గూగుల్ కీలక ఒప్పందం
Google signed a key agreement with AP Sarkar

ఆంధ్రప్రదేశ్, డిసెంబర్ 2024: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణ మరియు స్వీకరణను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ ఈరోజు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. Read more

శివరాత్రి బ్రహ్మోత్సవాలకి ప్రత్యేక – మినీ బస్సులు
శివరాత్రి బ్రహ్మోత్సవాలకి ప్రత్యేక - మినీ బస్సులు

మహా శివరాత్రి 2025:శివరాత్రి బ్రహ్మోత్సవాలకి ప్రత్యేక - మినీ బస్సులు ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినం జరగనుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని Read more

5 జిల్లాల పరిధిలో అమరావతి ORR.. కేంద్రం గెజిట్
amaravathi ec

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 189.9 కిలోమీటర్ల మేర Read more

నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు
CM Chandrababu is coming to Hyderabad today

హైదరాబాద్‌: ఈరోజుఉదయం హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. శంషాబాద్ లో మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించునున్నారు. ఇవాళ Read more