हिन्दी | Epaper

Latest Telugu News: GCCs: హైదరాబాద్‌నే దిగ్గజ కంపెనీలన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాయి?

Vanipushpa
Latest Telugu News: GCCs: హైదరాబాద్‌నే దిగ్గజ కంపెనీలన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాయి?

భారతదేశంలో టెక్నాలజీ, ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్ వంటి అనేక రంగాల్లో ప్రపంచస్థాయి కార్యకలాపాలను నిర్వహించే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs) స్థాపనకు హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా.. GCCలను ఆకర్షించడంలో హైదరాబాద్.. బెంగళూరు(Bengaluru)ను అధిగమించడం చర్చనీయాంశంగా మారింది. నెట్‌ఫ్లిక్స్, మెక్‌డొనాల్డ్స్, కాస్ట్‌కో తాజాగా ఫ్రెంచ్ బ్యూటీ మేజర్ లోరియల్ (LOreal) వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ GCCలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనం. అసలు హైదరాబాద్ హవా కొనసాగడానికి కారణాలేంటి? ఒకప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేరాఫ్ గా ఉన్న బెంగళూరు వెనుకపడడానికి కారణాలేంటి? హైదరాబాద్ ప్లస్ పాయింట్స్ ఇవే.. ఒక సంస్థ GCCని స్థాపించేటప్పుడు కేవలం ఉద్యోగుల లభ్యతనే కాకుండా.. ఆపరేటింగ్ ఖర్చులు, రియల్ ఎస్టేట్ ధరలు, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది.

Read Also: Vande Mataram 150 years : వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్…

GCCs
GCCs

హైదరాబాద్ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు

బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహణ, రియల్ ఎస్టేట్ ఖర్చులు సుమారు 15% తక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆఫీస్ అద్దెలు చదరపు అడుగుకు ఒక డాలర్ (సుమారు రూ.90) కంటే తక్కువగా ఉండటం కంపెనీలను బాగా ఆకర్షిస్తోంది. హైదరాబాద్ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, బలమైన డిజిటల్ కనెక్టివిటీ, అంతర్జాతీయ విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్స్ (హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) GCCల స్థాపనకు అనుకూలంగా ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్.. ఏదైనా టెక్ హబ్‌కు అత్యంత కీలకం నైపుణ్యం కలిగిన ఉద్యోగులు. హైదరాబాద్ నగరంలో బీఎఫ్‌ఎస్‌ఐ (BFSI), టెక్నాలజీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వంటి వివిధ రంగాలలో లోతైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి.

కొన్ని నివేదికల ప్రకారం..

ప్రభుత్వం ప్రోత్సాహం తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీలక విధానాలు, GCCల స్థాపన, విస్తరణకు మద్దతు ఇవ్వడం కూడా ఒక కారణం అని చెప్పచ్చు. సంస్థలు ఔట్‌సోర్సింగ్ నుండి ఇన్నోవేషన్, రీసెర్చ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అధిక విలువ కలిగిన కార్యకలాపాలపై దృష్టి పెట్టేందుకు ప్రోత్సహిస్తోంది. గత మూడేళ్లలో భారతదేశంలో కొత్తగా స్థాపించబడిన గ్రీన్‌ఫీల్డ్ GCCలలో దాదాపు 40% హైదరాబాద్‌లోనే ఉండటం ప్రభుత్వ విధానాల విజయాన్ని సూచిస్తోంది. హైదరాబాద్‌లో కొత్తగా వచ్చిన GCCలు ఫ్రెంచ్ కాస్మటిక్స్ దిగ్గజం లోరియల్ (L’Oréal) తన అతిపెద్ద గ్లోబల్ టెక్నాలజీ సెంటర్లలో ఒకదాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

📢 For Advertisement Booking: 98481 12870