Vizianagaram Road Accident: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు.
Read Also :Uttar Pradesh Crime: హోలీ వేడుకల్లో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

అదుపుతప్పి నుజ్జునుజ్జైన కారు
వేగంగా వెళ్తున్న కారు మరుపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమై (నుజ్జునుజ్జై) గుర్తుపట్టలేనంతగా తయారైంది. ఈ ప్రమాదంలో పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనంజయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారులో ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా విషాదం
బాధిత యువకులంతా పెదమానాపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని మృతుడి బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. క్షతగాత్రులను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గజపతినగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :