ED inquiry : ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఆయనను అధికారులు దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం విజయసాయి రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసి పంపించారు.
ఈడీ జారీ చేసిన నోటీసుల మేరకు ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆయనను గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అమలైన మద్యం విధానం, లైసెన్సుల మంజూరు, విక్రయ వ్యవస్థ, నిధుల మళ్లింపు వంటి అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్రపై కూడా అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం.
Read Also: Udayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం లైసెన్సులు, (ED inquiry) డిస్ట్రిబ్యూషన్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం ద్వారా సుమారు రూ.3,500 కోట్ల మేర నిధులు చేతులు మారినట్టు సిట్ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అదే ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఈ కేసులో విజయసాయి రెడ్డి నిందితుడిగా ఉన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఇతర నేతలు, మధ్యవర్తులను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: