ఒకవైపు అమెరికా-వెనిజులాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు రష్యా-అమెరికాల మధ్య ఉద్రిక్తతకు అవకాశం ఏర్పడింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి లను అదుపులోకి తీసుకుని, అమెరికాలో నిర్భందంలో ఉంచిన విషయం తెలిసిందే. ప్రపంచదేశాలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా తాజాగా రష్యా జెండాతో ప్రయాణిస్తున్న వెనిజులా చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, అవసరమైతే సైనిక ప్రతీకార చర్యలకు కూడా వెనుకాడబోమని రష్యా చట్టసభ్యులు హెచ్చరిస్తున్నారు.
Read also: Donald Trump : రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

We will sink the American boats… Russia’s ally
ఈ వ్యవహారంపై రష్యా పార్లమెంట్ సభ్యుడు అలెక్సీ జురావైవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఏం చేసినా మాకు శిక్ష పడదు అన్న అహంకారంతో అమెరికా వ్యవహరిస్తోంది. ఇలాంటి చర్యలకు గట్టి ప్రతిస్పందన అవసరం. అంతర్జాతీయ చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తే అమెరికా మిలిటరీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను ముంచివేయడం వంటి చర్యలు కూడా చేపట్టాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది.
ఆంక్షల ఉల్లంఘనలపై కొనసాగుతున్న నిఘా
ఇదిలా ఉండగా, ఈ నౌక స్వాధీనానికి సంబంధించిన వీడియోను యూఎస్ కోస్ట్ గార్డ్ తాజాగా విడుదల చేసింది. అమెరికా రక్షణశాఖ, తీర రక్షక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో రష్యా నౌకను సీజ్ చేసినట్లు ఆ వీడియోలో వెల్లడించింది. ఈ నౌకకు ప్రస్తుతం మ్యారినేరా అనే పేరు ఉండగా, గతంలో బెల్లా-1గా పిలిచేవారు. అమెరికా భద్రతకు, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని యూఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. ఈ ఘటన రష్యా-అమెరికాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump ప్రపంచదేశాలతో వైరాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత్, చైనాలపై భారత్ పై కూడా 500శాతం సుంకాలను పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇలా ట్రంప్ రష్యాను కట్టుదిట్టం చేసేందుకు ప్రయత్నిస్తుండడం రష్యాకు ఏమాత్రం గిట్టడం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: