వందేమాతరం(Vande matram) కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం జపించిన మంత్రం కాదని, భరత మాతను వలసవాద అవశేషాల నుంచి విముక్తి చేయడానికి రూపొందించిన పవిత్ర యుద్ధ నినాదమని ప్రధాని మోదీ(Moi)అన్నారు. వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై లోక్‌సభలో మోదీ చర్చ ప్రారంభించిన ఆయన, ఏడాది పొడవునా వందేమాతరం వేడుకలు జరుపుకొంటున్నట్లు వివరించారు. ఇవాళ్టి చర్చలు భవిష్యత్తు తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్న ప్రధాని, స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తి, ప్రేరణనను ఇచ్చిన వందేమాతరం 150 ఏళ్ల వేడుకల్లో మనం భాగం కావడం గర్వకారణమన్నారు.
Read Also: OCSO e-Box: అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్

వందేళ్లు పూర్తిచేసుకున్నప్పుడు దేశం
వందేమాతరం రచించిన సమయంలో భారతదేశంలోని ప్రతీ ఇంట్లో బ్రిటిష్ జాతీయ గీతమైన గాడ్ సేవ్ ద క్వీన్‌ను ఆలపించేలా చేయాలని యత్నించారని మోదీ గుర్తుచేశారు. వందేమాతరానికి 50 ఏళ్లప్పుడు దేశం బ్రిటిష్ పాలనలో ఉందని, అది వందేళ్లు పూర్తిచేసుకున్నప్పుడు దేశం ఎమర్జెన్సీలో ఉందని వివరించారు. ఆ విధంగా బెంగాల్ మేధో సంపత్తి దేశానికి ప్రేరణనిచ్చిందన్న మోదీ, బ్రిటిష్ దాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో విభజించు పాలించు విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. 1905లో వారు బెంగాల్‌నైతే విభజించారు, కానీ వందేమాతరం ఒక ధృడమైన రాయిలా నిలిచి దేశ ఐక్యతకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
read also: