Union Budget 2026: మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2026 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండగా, ఈసారి బడ్జెట్లో వివాహితులకు ఊరటనిచ్చే కీలక పన్ను సంస్కరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో “ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్” అనే కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: Medaram Jatara : మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు
ఈ విధానం ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు లేదా వ్యాపారాల ద్వారా ఆదాయం పొందుతున్న సందర్భంలో వారిని ఒకే ఆర్థిక యూనిట్‌గా పరిగణించి, ఇద్దరి ఆదాయాన్ని కలిపి ఉమ్మడిగా పన్ను చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇది పూర్తిగా ఐచ్చిక విధానం కావడంతో, దంపతులు తమకు అనుకూలంగా వేర్వేరుగా ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలా లేదా జాయింట్‌గా ఫైల్ చేసుకోవాలా అనే ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటికే అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ జాయింట్ టాక్సేషన్ విధానం అమల్లో ఉండటంతో, అక్కడ కుటుంబాలపై పన్ను భారం కొంతమేర తగ్గి, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మెరుగుపడినట్లు ఉదాహరణలు ఉన్నాయి.

భారతదేశంలో ఈ విధానం అమలులోకి వస్తే, ముఖ్యంగా ద్విఆదాయ మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారే అవకాశం ఉంది. పన్ను ఆదా పెరగడంతో పాటు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, హౌసింగ్ ప్లాన్స్ వంటి అంశాల్లో మెరుగైన ఆర్థిక ప్రణాళిక సాధ్యమవుతుంది. అంతేకాకుండా, వినియోగం పెరగడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై అధికారిక స్పష్టత మాత్రం 2026 కేంద్ర బడ్జెట్ రోజునే వెలువడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: