
టాలీవుడ్ నటి నుపుర్ సనన్(Nupur Sanon) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, ప్రముఖ గాయకుడు స్టెబిన్ బెన్ను ఆమె వివాహం చేసుకున్నారు. వారం రోజుల కిందటే ఇరువురి నిశ్చితార్థం జరగగా, తాజాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్(Udaipur)లో సంప్రదాయబద్ధంగా పెళ్లి కార్యక్రమం నిర్వహించారు.
Read also: Anaganaga Oka Raju: ఏపీలో ‘అనగనగా ఒకరాజు’ టికెట్ ధరల పెంపు
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వివాహ వేడుక సాదాసీదాగా, ఆత్మీయంగా సాగింది. నుపుర్ సనన్ ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్కు చెల్లెలు అన్న విషయం తెలిసిందే.
తెలుగులో రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన నుపుర్, ఇప్పుడు బాలీవుడ్‌లో ‘నూరాని చెహ్రా’ అనే చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: