हिन्दी | Epaper

A tragic wind : విషాద వీచిక!

Sudha
A tragic wind : విషాద వీచిక!

అనివార్య పరిస్థితుల్లో జరిగే ప్రమాదాలను తప్పించలేం. అజాగ్రత్త, నిర్లక్ష్యం, వలనజరిగే ప్రమాదాలకు బాధ్యులెవరు? అనే ప్రశ్నించే స్థాయిలో జరుగుతున్న ప్రమాదాలను ఏ విధం గానూ సమర్థించలేం. అలాంటి ప్రమాదం ఒరిస్సాలోని కటక్ ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఇంటెన్సివ్కర్ యూనిట్లో జరిగింది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో రోగులు ఎటూ లేవలేని పరిస్థితి. వారిని రక్షించలేని పరిస్థితుల్లో సిబ్బంది కాలిన గాయాలతో బయటపడ్డారు. అలా తప్పించుకోలేని వారు కనీసం పంది మంది మృత్యువాత పడ్డారు. రోగులను బయటకు తీసుకె
ళ్తుండగా కొంత మందికి గాయలయ్యాయి. కటక్ లోని ఎస్.సి.బి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి ట్రామాకేర్ విభాగం ఐసియులో హఠాత్తుగా మంటలు చెలరేగి పొగకమ్ముకొంది. ఇలాంటి ప్రమాదాలు జరిగి నప్పుడు ప్రమాదకారణాలను అన్వేషించడం కన్నా అతి వేగంతో ప్రభుత్వాలు మృతులకు, క్షతగాత్రులకు ఆగ మేఘాలమీద నష్టపరిహారాలు ప్రకటించడంతో సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు, బాధిత కుటుంబాలకు ఊరట చేకూరినట్లు భావించడమే చింతించదగిన విషయం. ఐసియులో 23 మంది రోగులు ండగా వారిని తరలిస్తుండగా ఏడుగురు రోగులు ప్రాణాలు
కోల్పోయారు. ఆ తదుపరి తరలిస్తుండగా ముగ్గురు. ప్రాణాలు కొడిగట్టాయి.

Read Also : Bengaluru cafe incident: యుద్ధం ఎఫెక్ట్.. నిమ్మరసానికి గ్యాస్ బిల్ ఏంట్రా బాబూ?

A tragic wind
A tragic wind

ఒడిశాలోనే ఈ ఆసుపత్రి బాగా పెద్దది. ఎస్ సిబి మెడికల్ కళాశాలకు అనుబంధంగా నిర్వహిస్తోన్న పెద్ద ఆసుపత్రి ఇది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైంది. పాతిక మంది బాధితులు చికిత్స పొందు తున్న మొదటి అంతస్తులోనే ఈ అగ్నిప్రమాదం జరిగింది. చనిపోయిన వారందరూ పెద్దలే. పిల్లలెవరూ లేరు. రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పుడు డాక్టర్లు కానీ నర్సులు కానీ విధి నిర్వహణలో లేరు. రెండు, రోజుల నాడు ఒడిశా మయూర్ భంజ్ జిల్లాలో వాయవ్య పవనాల సుడిగాలికి ఇద్దరు మృతి చెందగా, ఇళ్లు విధ్వం సమయ్యాయి. ఇలా ప్రకృతి బీభత్సాలకు ఎన్నో చావులు నమోదవడం సహజం. కానీ తాజాగా ఐసియులో జరిగిన అగ్నిప్రమాదం ఆ రోగులకు మృత్యుముహూర్తం పెట్టేసింది. ఎంతో జాగ్రత్తగా నిర్వహించాల్సిన ఆసుపత్రు లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు లేకుండా చూసుకోవా ల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంటుంది. ఎప్పటికప్పు డు నిపుణులచే నిర్వహించబడే యాజమాన్య వ్యవస్థ ఉండి తీరాలి. రోడ్డుమీద జరిగే బస్సు ప్రమాదాలలో అగ్నికి ఆహుతై చనిపోయేవారి గాధలు తెలుసుకున్నప్పు డు హృదయం ద్రవించిపోతుంది. అంతకన్నా తీవ్ర పరిస్థితులు ఆసుపత్రులలో ప్రమాదాలు జరిగినప్పుడు కన్పిస్తాయి. అన్నీ అగ్ని విషాద వీచికలే (A tragic wind). ఉత్తర భారతదేశంలో ఝాన్సీ పట్టణంలో 2024 నవంబరులో నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో సంభవించిన ప్రమాదంలో పంది మంది నవజాత శిశువులు అగ్నికి ఆహుతైన సంఘటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. మొన్నామధ్య విజయవాడలో కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న పేషంట్స్ హాల్లో గ్యాస్ లీకయి రోగులు ఎటూ పారిపోలేని పరిస్థితి. రెండో దారిలేదు. వెంటిలే టరు బద్దలు కొట్టి పారిపోవడమే శరణ్యమైంది. ఆ ప్రమాదంలో 11 మంది సజీవ దహనంకాగా మరి కొందరు కిటికిల్లోంచి దూకి ప్రాణం నిలబెట్టుకున్నవారు న్నారు. ప్రాణం పోగొట్టు కొన్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఎక్కడ ఈ విధమైన అగ్ని ప్రమాదాలు జరిగినా వారిని రక్షించడం ఎంతో కష్టతరం. ఝాన్సీ ఆసుపత్రిలో 55 మంది శిశువులున్న వార్డులో పెద్ద అగ్నిప్రమాదం జరిగితే 45 మందిని ఆసుపత్రి సిబ్బంది రక్షించగలిగారు. ప్రత్యేకించి ఇంటెన్సివ్కర్ యూనిట్లో జాగ్రత్తల విష యంలో నిర్లక్ష్యవైఖరిని క్షమించజాలము. గడువు ముగిసిన అగ్నిమాపక యంత్రాలు, పనిచేయని అగ్నిమాపక అలా రం వంటి భద్రతా పోటోకాల్ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. అవి లేనప్పుడు మాత్రమే అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణనష్టానికి దారితీయవచ్చు.

A tragic wind
A tragic wind

2019 లో హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఒక ప్రయివేటు ఆసు పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇంక్యుబేటర్లో మూడు నెలల పసికందు మృతిచెందింది. మరో నలుగురు గాయ పడ్డారు. ఆ ఆసుపత్రి అగ్నిమాపక భద్రతా లైసెన్స్ గడువు ముగిసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం సంభవించింది. అమీర్పేటలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మంది విద్యా ర్థులు చిక్కుకున్నా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఐసియూలో అగ్నిప్రమా దాల నివారణకు ఎన్నో జాగ్రత్తలు నిర్దేశించబడి ఉన్నా వాటిని పాటించకపోవడం వల్లనే ప్రమాదాలను తప్పించ లేని పరిస్థితి ఉంది. అగ్ని నిరోధక పదార్థాలను అందు బాటులో ఉంచడం, రేడియేషన్క లిగించే పరికరాలు సమీపంలో లేకుండా చూసుకోవడం, ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుకోవడం ప్రధానం. అందుబాటులో అలారం వ్యవస్థను ఉంచుకోవాలి. అవి ఎక్కడైతే లేవో అక్కడే ప్రమాదం పొంచి ఉంటుంది. పొగవల్ల ఊపిరాడ కపోవడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగా ముంబై బాండవ్వెస్ట్లోని ఒక మాల్ తొలి అంతస్తులోని ఆసుపత్రిలో 11 మంది మృతిచెందారు. 9 మంది మంటలు కారణంగానే చనిపోయారు. నిర్లక్ష్యం ప్రమాదాలకు ఆస్కామౌతున్న ఆసుపత్రి యాజమాన్యం ఖర్చుకుదడిసి వాటిని పట్టించుకోకపోవడంతో రోగులు మూల్యం చెల్లించుకుంటున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870