
నటి ప్రియాంక చోప్రాపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆమె నటనను కొనియాడుతూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా మరోసారి రాజీపడని, దృఢమైన నటన కనబరిచారు.
Read Also: Telangana HC: చిరంజీవి సినిమాకి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి
దొంగ పాత్రలో ప్రియాంక
ఫిబ్రవరి 25న విడుదలవుతున్న ‘ది బ్లఫ్’ (The Bluff Movie) చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అని మహేశ్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ది బ్లఫ్’ చిత్రం 1800ల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇందులో ఎర్సెల్ బోడెన్ అనే ఒక మాజీ సముద్రపు దొంగ పాత్రలో ప్రియాంక కనిపించనున్నారు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే తల్లిగా ఆమె నటన ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకులు రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: