SIR New Guidelines : తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల అధికారులు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఇకపై ప్రతి ఓటరూ విచారణ కోసం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సంబంధిత బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. సంబంధిత గుర్తింపు పత్రాలను BLOలు నేరుగా ఓటర్ల నుంచి సేకరించి ECI.NETలో అప్‌లోడ్ చేయాలని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయం సూచించింది. అనంతరం ERO ఆ పత్రాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందించారు. అసాధారణ పరిస్థితుల్లో నోటీసులు అందుకున్న ఓటరు స్వయంగా విచారణకు హాజరు కాలేకపోతే, అదే కుటుంబానికి చెందిన 18 ఏళ్లు పైబడిన ఒక కుటుంబ సభ్యుడు వారి తరఫున హాజరు కావచ్చని అధికారులు తెలిపారు. సాధ్యమైన సందర్భాల్లో విచారణను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కూడా సూచించారు. కొత్తగా నోటీసులు అందుకునే వారు, ఇప్పటికే నోటీసులు అందుకున్నప్పటికీ విచారణకు హాజరుకాని వారిని కలిపి రాష్ట్రంలో సుమారు 33.91 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని BLOలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Read Also: KTR Passport : KTR పాస్ పోర్ట్ జప్తు చేయాలని పిటిషన్!

SIR New Guidelines : నిరాశ్రయులు, కార్మికుల కోసం సహాయ కేంద్రాలు
నిరాశ్రయ కేంద్రాల్లో నివసిస్తున్నవారు, కూలీలు, కార్మికులు, పేదలు, వివిధ పనుల కోసం వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నవారి కోసం ప్రత్యేక శిబిరాలు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొత్త మార్గదర్శకాల్లో సూచించారు. దీనివల్ల ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన వారు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదుకు కూడా ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని తెలిపింది. ఇందుకోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. SIR నోటీసుల పంపిణీ, విచారణ విషయంలో కొన్ని ప్రాంతాల్లో BLOలు ఓటర్ల ఇళ్లకు వెళ్లకుండా ఒకే చోట నోటీసులు తీసుకోవాలని సూచించినట్లు విమర్శలు వచ్చాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :