సంక్రాంతి కానుకగా విడుదలై, విజయం అందుకున్న కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 4 నుండి తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. హీరో శర్వానంద్ (Sharwanand), హీరోయిన్లుగా సాక్షీ వైద్య, సంయుక్త, సీనియర్ నటుడు నరేశ్, సత్య, సునీల్, వెన్నెల కిశోర్ తమ కామెడీతో అలరించారు.
Read Also: Actor: సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి
ఈ సినిమా కథ విషయానికి వస్తే..
గౌతమ్ (శర్వానంద్) (Sharwanand) ఒక ఆర్కిటెక్ట్. తను పనిచేసే ఆఫీసులోనే నిత్య (సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయణం సాఫీగా సాగుతున్న క్రమంలో, అదే ఆఫీసుకు టీమ్ లీడర్‌గా గౌతమ్ మాజీ ప్రేయసి దియా (సంయుక్త మీనన్) ఎంట్రీ ఇస్తుంది. అయితే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గౌతమ్ జీవితం ఈ ఇద్దరు భామల మధ్య ఎలా నలిగిపోయింది? తన గతాన్ని ప్రస్తుత ప్రేయసికి ఎలా దాచాడు? చివరకు గౌతమ్ ఎవరిని చేరుకున్నాడు? అనే అంశాలను దర్శకుడు హిలేరియస్ కామెడీతో మలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: