Jana nayagan box office : తలపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయకన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హడావుడి సృష్టిస్తోంది. జనవరి 9న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, విడుదలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతోంది. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది.
ఇటీవలే విజయ్ నటనకు గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయి (jana nayagan box office) రాజకీయాల్లోకి వెళ్తానని మరోసారి స్పష్టం చేయడంతో, ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. పొంగల్ పండుగ సీజన్‌కు ముందే విడుదలవుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’తో పోటీ ఉన్నప్పటికీ, ‘జన నాయకన్’కు గ్లోబల్‌గా మంచి ఓపెనింగ్ దక్కేలా కనిపిస్తోంది.
Read also: AP: త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా: సీఎం చంద్రబాబు
అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సుమారు రూ.34.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఎక్కువగా తొలి రోజు టికెట్లు అమ్ముడుపోగా, తొలి వీకెండ్‌కూ భారీగా బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే, విడుదలైన తర్వాత సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: