శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్(Iran) యుద్ధనౌకను అమెరికా(America) జలాంతర్గామి ముంచేయడం పశ్చిమాసియా మరియు దక్షిణాసియా జలాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ నావికాదళానికి చెందిన ప్రతిష్టాత్మక యుద్ధనౌక IRIS దేనా (IRIS Dena) హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా, అమెరికాకు చెందిన ఒక శక్తివంతమైన జలాంతర్గామి దానిని ఢీకొట్టి ముంచేసింది. ఇరాన్ తీరానికి దాదాపు 2,000 మైళ్ల దూరంలో, అంతర్జాతీయ జలాల్లో ఈ దాడులు జరగడం గమనార్హం. భారత నావికాదళానికి అతిథిగా వెళ్తున్న సమయంలోనే ఈ అటాక్ జరిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది.
Read Also: Middle East Conflict: యుద్ధ ప్రభావంతో గల్ఫ్ నుంచి శంషాబాద్‌కు వచ్చే విమానాలు రద్దు

130 మంది నావికుల ప్రాణాలకు ముప్పు
ఈ యుద్ధనౌకలో దాదాపు 130 మంది నావికులు ఉన్నట్లు సమాచారం. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా అమెరికా ఈ “దారుణానికి” పాల్పడిందని అరాఘ్చి విమర్శించారు. “అమెరికా సృష్టించిన ఈ ప్రమాదకరమైన సంప్రదాయానికి ఆ దేశం భవిష్యత్తులో తీవ్రంగా పశ్చాత్తాపపడక తప్పదు” అని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు పశ్చిమాసియాకే పరిమితమైన ఇరాన్-అమెరికా ఘర్షణలు, ఇప్పుడు హిందూ మహాసముద్రానికి పాకడం భారత్ వంటి దేశాలకు ఆందోళన కలిగించే విషయం. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో ఇలాంటి దాడులు జరగడం వల్ల ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ, ఇరాన్ మాత్రం దీనిని యుద్ధ నేరంగా పరిగణిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: