పొట్టకూటి కోసం, కడుప మంట చల్లార్చుకోవడానికి చాలామంది భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళుతుంటారు. అలాగే ఉద్యోగాల కోసం అమెరికా, యూకే, ఇటలీ లాంటి దేశాలకు కూడా వెళుతుంటారు. ఇప్పుడు వార్ జరుగుతున్న పశ్చిమాసియాకు కూడా చాలా మంది భారతీయులు పొట్ట కూటి కోసం వలస వెళ్లారు. అయితే ఇప్పుడు అక్కడ యుద్ధభూమిలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడ కాలం గడుపుతున్నారు. అయితే వీరు మన ఆర్థిక వ్యవస్థకు చాలా మూలాధారం అని చెప్పవచ్చు.
Read Also: Sheshnag150: ఇరాన్‌కు షాహెద్.. అమెరికాకు LUCAS.. మరి భారత్‌కు?

ఉపాధి కొనసాగడం భారత్‌కు అత్యంత కీలక అంశం
ఆసియాలోని చాలా దేశాల మాదిరిగానే భారతదేశం కూడా పెర్షియన్ గల్ఫ్ మీదుగా రవాణా అయ్యే చమురు, సహజ వాయువు వంటి ఇంధన వనరులపై తీవ్రంగా ఆధారపడుతోంది. అయితే భారత్‌కు గల్ఫ్(Gulf) ప్రాంతం కేవలం ఇంధన సరఫరాకు మాత్రమే పరిమితం కాదు. దక్షిణ భారత తీరానికి సమీపంలో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాల్లో లక్షలాది భారతీయులు తరతరాలుగా నివసిస్తూ అక్కడే తమ జీవనోపాధిని నిర్మించుకున్నారు. వారి సురక్షిత ప్రయాణం, ఉపాధి కొనసాగడం భారత్‌కు అత్యంత కీలక అంశం. 1970ల చమురు సంక్షోభం తర్వాత పెర్షియన్ Gulf ప్రాంతం భారతదేశం, దక్షిణాసియాకు ఆర్థిక విస్తరణగా మారింది. ఈ ప్రాంతంలో ఏర్పడే ఏ పెద్ద అంతరాయం అయినా కేవలం చమురు ధరలకే కాదు, లక్షలాది భారతీయుల ఉద్యోగాలు, జీవనోపాధులు, బిలియన్ల డాలర్ల వాణిజ్యానికి ముప్పుగా మారుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియాలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడం, వాటిని పొరుగుదేశాలు అడ్డుకోవడం వంటి ఘటనలతో పూర్తి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల మధ్య, ప్రపంచానికి కీలకమైన హార్ముజ్ జలసంధి దాదాపుగా మూసివేయబడటం గ్లోబల్ మార్కెట్లను వణికించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: