हिन्दी | Epaper

Health Awareness: ఇబ్రహీంపట్నంలో ఉత్సాహంగా 5కే రన్

Rajitha
Health Awareness: ఇబ్రహీంపట్నంలో ఉత్సాహంగా 5కే రన్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 5కే రన్ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వై. సుదర్శన్, ఆర్డీవో అనంత రెడ్డి జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. స్థానిక గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ పరుగులో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read also: Dark Chocolate: కోకో తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుదల

Exciting 5K run in Ibrahimpatnam

Exciting 5K run in Ibrahimpatnam

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు, గురునానక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870